Bhumi Reddy Ramgopal Reddy : ప్రశాంత్ కిషోర్ టీమ్ రిపోర్టు వల్లే వైసీపీ ముందస్తుకు తొందర : MLC భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయా..? దీని కోసం వైసీపీ ముందుగానే ప్లాన్ వేసుకుంటోందా..? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ జగన్ కు రిపోర్టు ఇవ్వటం వల్లే జగన్ ముందుస్తు ఎన్నికలకు త్వరపడుతున్నారా..?అందుకే యత్నాలు జరుగుతున్నాయా..?

MLC Bhumi Reddy Ramgopal Reddy
TDP MLC Bhumi Reddy Ramgopal Reddy : వైసీపీ ప్రభుత్వానికి మే వరకు సమయం ఉన్నా డిసెంబర్ లోపే ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. మేలో ఎన్నికలు జరిగితే 15 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం చెప్పిందని అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది అని అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళితే కాస్త మెరుగ్గా ఫలితాలు వస్తాయని ప్రశాంత్ కిషోర్ టీం రిపోర్ట్ ఇచ్చిందిని అందుకే సీఎం జగన్ ముదస్తు ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నారని అన్నారు. కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ 175 కు 175 స్థానాలు గెలుచుకోవడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని 175 స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. శ్రీవారి ఆలయంలో దర్శన సమయం లో కొంతమంది తమకు కావలసిన వారిని క్యూ లైన్ లను ఆపి తీసుకెళ్లటం సరికాదు అంటూ ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఇష్టానుసారంగా ముందున్న వారిని ఆపేసి వారికి కావలసిన వారిని తీసుకెళ్తున్నారు అంటూ ఆరోపించారు. అటువంటి వారిపై టిటిడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
NDA Meet: టీడీపీకి ఎన్డీయే నుంచి పిలుపొచ్చిందా.. చంద్రబాబు రియాక్షన్ ఏంటి?
అలాగే రాష్ట్రంలో దారుణమైన ఘోరాలు జరుగుతున్నాయని అన్యాయాలు, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అంటూ మరో టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అరికట్టాలని ..తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రజా పోరాటాలు విజయవంతం కావాలని ..దీనికి ప్రజలు సహకరించాలని కోరారు.
కాగా..ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ ఆ దిశగా యోచిస్తున్నారని పలువురు రాజకీయ నేతలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే విషయాన్ని తెలుగుదేశం నేతలు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు చేరువ కావటానికి టీడీపీ పలు కార్యక్రమాలు చేస్తోంది. నేతలకు కూడా చంద్రబాబు అదే చెబుతున్నారు. ఎన్నికలు ఏ సమయంలో వచ్చినా సిద్ధంగా ఉండాలని దిశా నిర్ధేశం చేశారు. దీని కోసం పలు కార్యక్రమాల ద్వారా టీడీపీ నేతలు ప్రజలకు చేరువ అవుతున్నారు.
Varahi Vijaya Yatra: పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర రెండో విడత షెడ్యూల్ ఇదే..
మరోపక్క జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇప్పటికే మొదటి విడత వారాహి యాత్రను పూర్తి చేసుకుని రెండో యాత్రకు రెడీ అయ్యారు. రేపటినుంచి అంటే జులై 9న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో సభ నిర్వహించనున్నారు. దీని కోసం ఇప్పటికే కార్యక్రమాలు దాదాపు పూర్తి అయ్యాయి. రెండో విడత వారాహి యాత్రకు పవన్ షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు.ఇంకోపక్క బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇలా ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయం అనేలా ఎన్నికల వాతావరణం వాడీ వేడీగా కొనసాగుతోంది.