కాలేజ్ నాలుగో అంతస్తు నుంచి దూకిన వైద్యురాలు.. మృతి

Woman doctor dies: మెడికల్ కాలేజీలో జరుగుతున్న క్యాన్సర్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు ఆమె వచ్చారు.

కాలేజ్ నాలుగో అంతస్తు నుంచి దూకిన వైద్యురాలు.. మృతి

నెల్లూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ నాలుగో అంతస్తు నుంచి దూకి జ్యోతి అనే వైద్యురాలు బలవన్మరణానికి పాల్పడింది. జ్యోతి చేజర్ల మండలం చిత్తలూరు పీహెచ్‌సీలో వైద్యాధికారిగా పనిచేస్తున్నారు.

మెడికల్ కాలేజీలో జరుగుతున్న క్యాన్సర్ ట్రైనింగ్ ప్రోగ్రాంకు ఆమె వచ్చారు. మధ్యాహ్నం విశ్రాంతి సమయంలో భవనంపై నుంచి దూకారు. ఆమెను గమనించిన తోటి వైద్యులు అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. కాగా, జ్యోతి భర్త కూడా వైద్యుడే. ఏవీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీలో జ్యోతి భర్త రవిబాబు ఎముకల డాక్టర్‌గా పనిచేస్తున్నారు. జ్యోతి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ