నాడు – నేడు : జగన్ ఆనాడు ఏం మాట్లాడారు..ఎందుకా మార్పు

అప్పుడు ప్రతిపక్ష నేత జగన్ ఏం మాట్లాడాలో తెలుసుకోవాలని సూచించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. 2014 సెప్టెంబర్ 04 అసెంబ్లీలో జగన్ మాట్లాడిన మాటలను వీడియో చూపించారు బాబు. వీడియోలో వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. అనంతరం సీఎం అయిన తర్వాత జగన్ మాటలను వీడియోలో వినిపించారు. డిసెంబర్ 13న బోత్స సత్యనారాయణ చేసిన ప్రకటనను కూడా చూపించారు. డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
మీరు యూ టర్న్ తీసుకుంది వైసీపీ, ప్రాంతీయ విభేదాలు వస్తే నష్టపోతామన్నారు. కౌన్సిల్‌లో ఒక మాట చెప్పి..మరొక మాట్లాడుతున్నారని మంత్రి బోత్స చెబుతున్నారని విమర్శించారు. వైసీపీ మంత్రులు, స్పీకర్ తలో విధంగా వ్యాఖ్యానిస్తున్నారని తెలిపారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తే..మీకు ఎందుకు అక్కసు అంటూ నిలదీశారు బాబు. ప్రభుత్వం మారితే రాజధాని మార్చేస్తారా ? ఎవరి ఇచ్చారు హక్కూ ప్రశ్నించారు. తమ భవిష్యత్ ఏంటని..భూములిచ్చిన రైతులు ఆందోళన చేస్తుంటే..అర్థం కావడం లేదా, ఎలా చెప్పాలా అన్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే పారిపోవడం ఖాయమన్నారు బాబు.
* డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.
* రాజధాని విశాఖలో అయితే అమరావతిలో పెట్టిన ఖర్చులో కేవలం 10శాతం ఖర్చు చేస్తే హైదరాబాద్‌ను తలదన్నే రాజధాని అవుతుందన్నారు సీఎం జగన్.
రాజధాని తరలింపుపై హైపవర్ కమిటీ వేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.
* మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది.
* జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదిక, హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించి రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
* జనవరి 20 తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మూడు రాజధానుల నిర్మాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
* ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణకు వెళ్లే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
Read More : సీఎం, మంత్రిని అడుగుతున్నా : ఎంతెంత ఖర్చు చేశామంటే..బాబు లెక్కలు