కడప జిల్లాలో ప్రేమోన్మాది ఘాతకం – యువతిపై కత్తితో దాడి

కడప జిల్లాలో ప్రేమోన్మాది ఘాతకం – యువతిపై కత్తితో దాడి

Knife-attack

Updated On : January 22, 2021 / 5:14 PM IST

young man attacked on b.tech student with knife due to love affair : కడప జిల్లా ప్రొద్దుటూర్‌లో ఒక ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో యువతిపై కత్తితో దాడి చేసి హతమార్చేందుకు ప్రయత్నించాడు. ప్రొద్దుటూరు లోని వివేకానంద కాలనీకి చెందిన సునీల్‌ అనే యువకుడు నేతాజీనగర్‌కు చెందిన లావణ్య అనే బీటెక్ చదివే యువతి (17)ని ప్రేమించాలంటూ గత కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. అతడి వేధింపులను లావణ్య ఒపిగ్గా భరిస్తూ వచ్చింది.

సునీల్ వేధింపులు భరించలేని లావణ్య ఇటీవల ప్రేమించనని సునీల్‌కు తెగేసి చెప్పడంతో ఆమె పై కోపం పెంచుకున్నాడు.‌ శుక్రవారం ఉదయం ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి…… యువతి ఇంటికి వచ్చి కత్తితో ఆమెపై దాడి చేసి పరారయ్యాడు. సునీల్ చేసిన దాడిలో యువతి చేతి వేళ్లు కొన్ని తెగిపోయాయి.

స్థానికులు బాధితురాలిని వెంటనే చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. మూడు నెలలుగా సునీల్‌‌ తమ కూతురిని వేధిస్తున్నట్లు యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.