YS Jagan: వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఈ సారి జగనన్న 2.0 కొంచెం వేరుగా..
వైసీపీ బతుకుతుందని, ఈ రాష్ట్రాన్ని ఏలుతుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు.

YS JaganMohan Reddy
ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ బతుకుతుందని, ఈ రాష్ట్రాన్ని ఏలుతుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చి మరో 30 సంవత్సరాలు ఏలుతామని చెప్పారు. ఒక్కటి గుర్తు పెట్టుకోవాలని, ఈ సారి జగనన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుందని తెలిపారు.
ఈ సారి జగనన్న 2.0 కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తుందో చూపిస్తుందని, ఈ విషయాన్ని కచ్చితంగా చెబుతున్నానని జగన్ అన్నారు. జగనన్న 1.0లో కార్యకర్తల పక్షాన అంత గొప్పగా పని చేయలేకపోయిండవచ్చని అభిప్రాయపడ్డారు.
G Trisha: యువ సంచలనం త్రిషకు భారీ నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రతి పథకం, ప్రతి విషయంలో మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకువచ్చి వారి కోసమే తాపత్రయపడ్డానని, వారి కోసమే తన సమయాన్ని కేటాయించానని జగన్ తెలిపారు, ప్రజల కోసమే అడుగులు వేశానని అన్నారు. కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైసీపీ కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశానని తెలిపారు.
వైసీపీ కార్యకర్తల బాధలను గమనించానని, వారి కోసం తాను అండగా ఉంటానని వైఎస్ జగన్ అన్నారు. విజయవాడ కార్పొరేషన్‌లో 64 స్థానాలుంటే 49 స్థానాలను అప్పట్లో వైసీపీ గెలిచిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులు 1 గెలిచారని గుర్తుచేశారు.
వాళ్లకు కేవలం 14 స్ధానాలున్నా… ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల ప్రలోభాలపెట్టో, భయపెట్టో 13 మందిని తీసుకున్నారని జగన్ తెలిపారు. ఇంకా 38 మంది నిటారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడుతున్నానని చెప్పారు. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని మరోసారి అన్నారు.