YS Viveka Case: దస్తగిరికి బెయిల్ రావటానికి సీబీఐ సహకరించింది అంటూ సీబీఐపై వైఎస్ భాస్కర్ రెడ్డి ఆరోపణలు..

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ నోటీసులు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ, వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటీషన్ వేశారు. వివేకా కేసులో కీలక నిందితుడుగా ఉండి ప్రస్తుతం అప్రూవర్ గా మారిన దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ వేసారు వైఎస్ భాస్కర్ రెడ్డి.

YS Viveka Case:  దస్తగిరికి బెయిల్ రావటానికి సీబీఐ సహకరించింది అంటూ సీబీఐపై వైఎస్ భాస్కర్ రెడ్డి ఆరోపణలు..

YS Viveka Case: YS Bhaskar Reddy Petition in TS High Court for Cancellation of Dastagiri Bail

Updated On : March 20, 2023 / 11:30 AM IST

YS Viveka Case : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ నోటీసులు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ, వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటీషన్ వేశారు. వివేకా కేసులో కీలక నిందితుడుగా ఉండి ప్రస్తుతం అప్రూవర్ గా మారిన దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ వేసారు వైఎస్ భాస్కర్ రెడ్డి. ఈకేసును కూలకషంగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే వైఎస్ అవినాశ్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కొడుకుబాటలోనే తండ్రి అన్నట్లుగా వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐపై తాజాగా ఆరోపణలు చేశారు.

CBI Notice Avinash Reddy : వివేకా హత్య కేసు.. ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లను విచారించిన సీబీఐపై భాస్కర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడని ఆరోపించిన భాస్కర్ రెడ్డి అటువంటి దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా మమ్మల్ని నేరంలోకి నెట్టడం సమంజసం కాదన్నారు. వివేకా హత్య కేసులో అత్యంత కీలకంగా వ్యవహరించిన దస్తగిరి కి బెయిల్ ఇవ్వటం సరికాదనీ..దస్తగిరికి బెయిల్ ఇవ్వటంలో సీబీఐ సహకారం ఉంది అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్మెంట్ ఇస్తున్నాడని అతని స్టేట్మెంట్ ఆధారంగా మమ్మల్ని నేరంలోకి నెట్టడం సమంజసం కాదంటూ పిటీషన్ వేశారు.వివేక హత్య కేసులో కీలకంగా ఉన్న దస్తగిరే హత్య చేయటానికి ఆయుధాన్ని కొనుగోలు చేశాడని తెలిపారు. దస్తగిరిపై ఉన్న ఆధారాలను కింది కోర్ట్ పట్టించుకోలేదని..దస్తగిరికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు భాస్కర్ రెడ్డి.

Viveka Murder Case : వైఎస్ వివేకా హత్య కేసు.. టీఎస్ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ లో సంచలన విషయాలు