YSRCP PAC Members : వైసీపీలో కొత్త నియామకాలు, పదవుల భర్తీ.. పీఏసీ మెంబర్లు వీరే..

వైసీపీలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరించారు. 33 మంది నేతలను పీఏసీ మెంబర్లుగా పార్టీ నియమించింది.

YSRCP PAC Members : వైసీపీలో కొత్త నియామకాలు, పదవుల భర్తీ.. పీఏసీ మెంబర్లు వీరే..

Updated On : April 12, 2025 / 11:05 PM IST

YSRCP PAC Members : వైసీపీలో పలు పదవులు భర్తీ అయ్యాయి. పలు నియామకాలను ఆ పార్టీ అధినేత జగన్ చేపట్టారు. పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పునర్ వ్యవస్థీకరించారు. పీఏసీ మెంబర్లను ప్రకటించింది వైసీపీ. అటు సమన్వయకర్తలుగా పలువురిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు జగన్. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరించడం జరిగిందని, పలువురు నాయకులను పీఏసీ మెంబర్లుగా నియమించడమైనదని పత్రికా ప్రకటనలో తెలిపింది వైసీపీ కేంద్ర కార్యాలయం.

అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే శ్రీకాంత్ నియమితులయ్యారు. కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్‌, క్రమశిక్షణా కమిటీ సభ్యుడిగా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి నియమితులయ్యారు.

వైసీపీలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీని పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరించారు. 33 మంది నేతలను పీఏసీ మెంబర్లుగా పార్టీ నియమించింది. పీఏసీ కో ఆర్డినేటర్ గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు.

Also Read : జనసేన ఖాతాలో తొలి మున్సిపాలిటీ.. ఒక్క కౌన్సిలర్ కూడా లేకుండానే నిడదవోలు కైవసం

పీఏసీ మెంబర్లు వీరే..

1. తమ్మినేని సీతారాం
2. పీడిక రాజన్న దొర
3. బెల్లాన చంద్రశేఖర్
4. గొల్ల బాబురావు, ఎంపీ
5. బూడి ముత్యాలనాయుడు
6. పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ
7. పినిపే విశ్వరూప్
8. తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ
9. ముద్రగడ పద్మనాభం
10. పుప్పాల శ్రీనివాసరావు

11. చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు
12. కొడాలి నాని
13. వెలంపల్లి శ్రీనివాస్
14. జోగి రమేష్
15. కోన రఘుపతి
16. విడదల రజిని
17. బొల్లా బ్రహ్మనాయుడు
18. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి
19. నందిగం సురేష్ బాబు
20. ఆదిమూలపు సురేశ్

21. పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
22. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
23. కళత్తూరు నారాయణ స్వామి
24. ఆర్కే రోజా
25. వైఎస్‌ అవినాశ్ రెడ్డి
26. షేక్ అంజాద్ బాషా
27. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
28. అబ్దుల్ హఫీజ్ ఖాన్
29. మాలగుండ్ల శంకర నారాయణ
30. తలారి రంగయ్య

31. వై.విశ్వేశ్వర రెడ్డి
32. మహాలక్ష్మి శ్రీనివాస్
33. సాకే శైలజానాథ్