Pendem Dorababu : జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే
గత ఎన్నికల్లో తనని కాదని వంగా గీతకు పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్.

Pendem Dorababu : వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కుటుంబసభ్యులతో కలిసి పవన్ కల్యాణ్ ను కలిశారు పెండెం దొరబాబు. జనసేనలో చేరేందుకు దొరబాబు ఆసక్తి వ్యక్తం చేయగా అందుకు పవన్ కల్యాణ్ అంగీకారం తెలిపినట్లు సమాచారం.
Also Read : ఒక్క ఛాన్స్ ప్లీజ్.. ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ ఆశావహుల కోలాహలం..
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు పెండెం దొరబాబు. కుటుంబసభ్యులతో వెళ్లి ఆయన పవన్ కల్యాణ్ ను కలవడం ఆసక్తికరంగా మారింది. జనసేన పార్టీలో చేరికపై పవన్ కల్యాణ్ తో దొరబాబు చర్చించారట. చేరికకు పవన్ కూడా ఓకే చెప్పారట. వారం రోజులు దొరబాబు జనసేన కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. కాగా, గత ఎన్నికల్లో తనని కాదని వంగా గీతకు పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. దాంతో పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేశారు.