ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు

ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు : బాగా ముదిరిపోయింది
ఏపీలో వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను, తన సహచర ఎమ్మెల్యేలను మాటలతో కించపరుస్తున్నారంటూ శ్రీనివాస్ ఎంపీపై మండిపడ్డారు. ఎమ్మెల్యేలను పందులు అంటూ కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదులో తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఎంపీ రగురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారనీ..తన పరువు ప్రతిష్టలకు నష్టం వాటిల్లేలా ప్రవర్తించిన ఎంపీ రఘురామకృష్ణంరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భీమవరం పోలీస్‌స్టేషన్‌తో పాటు.. జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్.
కాగా..సొంత పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీసులు ఇచ్చిన విసయం తెలిసిందే. దానిపై ఆయన సరైన సమాధానం ఇవ్వకపోడం.. ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలవడం..వైసీపీ నేతలపైనే ఫిర్యాదు చేయడం వంటి పలు పరిణామాలతో..ఆయనపై స్వపక్ష నేతలతో పాటు సీఎం జగన్ ఆగ్రహంతో ఉన్నారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.