YSRCP: వైసీపీలో ఇద్దరు కీలక నేతలపై ఆ పార్టీ అధిష్ఠానం చర్యలు

కూడేరు, ఉరవకొండ మండలాల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటీవల హాట్ టాపిక్ గా మారాయి.

YSRCP: వైసీపీలో ఇద్దరు కీలక నేతలపై ఆ పార్టీ అధిష్ఠానం చర్యలు

YSRCP

Updated On : July 5, 2023 / 6:43 PM IST

YSRCP – Anantapur: అనంతపురం జిల్లా వైసీపీ(YCP)లో ఇద్దరు కీలక నేతలపై ఆ పార్టీ అధిష్ఠానం సీరియస్ అయింది. వైసీపీ నేత వై.మధుసూదన్ రెడ్డి(Y.Madhusudhan Reddy)ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. గత నెల 29న సొంత పార్టీ నేతలపై మధుసూదన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఉరవకొండ నియోజకవర్గంలో భూకబ్జాలు, వైసీపీ నేతల దౌర్జన్యాలు మితిమీరాయని అన్నారు. కూడేరులో భూ అక్రమాల్లో వైసీపీ నాయకులు ఉన్నారని చెప్పారు. పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ప్రణయ్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. దీంతో వై.మధుసూదన్ పై వైసీసీ చర్యలు తీసుకుంది. కూడేరు, ఉరవకొండ మండలాల విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటీవల హాట్ టాపిక్ గా మారాయి.

అలాగే, మాజీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చామలూరు రాజగోపాల్ కి వైసీపీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై వారం రోజుల లోపు వివరణ ఇవ్వాలని చెప్పింది. ఏప్రిల్ 23న ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, సాంబ శివారెడ్డిపై ఆయన విమర్శలు చేశారు.

ఇద్దరు నేతలపై చర్యలు తీసుకుంటున్న విషయంపై జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య స్పందించారు. పార్టీ పరువుకు భంగం కలిగించినందుకు ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Buddha Venkanna: అక్కడ వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి: బుద్దా వెంకన్న