Kodali Nani : నిరాశతో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ
గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం వైసీపీ వల్లభనేని వంశీ వెనుకంజలో ఉన్నారు.

Kodali Nani and Vallabhaneni Vamsi left the counting center
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి హవా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి 150 కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తెలుగు దేశం పార్టీ 127 స్థానాల్లో జనసేన 19 స్థానాల్లో, బీజేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా అధికార పార్టీ వైసీపీ 19 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
ఇదిలా ఉంటే.. గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని, గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ వెనుకంజలో ఉన్నారు. దీంతో నిరాశ చెందిన వారు రెండో రౌండ్‌లోనే కౌంటింగ్ కేంద్రమైన కృష్ణ యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్లిపోయారు.