Ugadi 2025 : ఈ ఏడాది మొత్తం ఆదివారం నాన్ వెజ్ తినొద్దు, మందు తాగొద్దు- ప్రముఖ సిద్ధాంతి బాచంపల్లి సంతోష్ కుమార్

ఇది తెలంగాణ ప్రజలంతా తెలుసుకోవాలి. ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చింది కాబట్టి సూర్యుడు రాజు అయ్యాడు.

Ugadi 2025 : ఈ ఏడాది మొత్తం ఆదివారం నాన్ వెజ్ తినొద్దు, మందు తాగొద్దు- ప్రముఖ సిద్ధాంతి బాచంపల్లి సంతోష్ కుమార్

Updated On : March 31, 2025 / 12:34 AM IST

Ugadi Panchanga Sravanam 2025 : ప్రముఖ సిద్ధాంతి బాచంపల్లి సంతోశ్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు ఈ ఏడాది మొత్తం ఆదివారం రోజున మందు, మాంసానికి దూరంగా ఉంటే ఈ విశ్వావసు నామ సంవత్సరం బ్రహ్మాండంగా ఉండబోతోందని బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి అన్నారు.

”చుక్క ముక్కకు దూరంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, భగవంతుడు అనుగ్రహిస్తాడు. పరిపాలన సవ్యంగా జరగాలంటే ఈ నియమం పాలకులు, అధికారులు, ప్రజలు పాటించాలి. సూర్య నమస్కారాలు చేసిన వ్యక్తి శక్తిమంతుడు అవుతాడు” అని ఉడాది పంచాంగ శ్రవణంలో చెప్పారాయన.

ఆదివారం నాన్ వెజ్ ఎందుకు తినకూడదో కూడా బాచంపల్లి సంతోష్ కుమార్ వివరించారు. ఈసారి ఉగాది ఆదివారం వచ్చిందని, సూర్యుడు రాజు అయ్యాడని, అందుకే మందుకి, నాన్ వెజ్ కి దూరంగా ఉండాలని చెప్పారు. ఈ సంవత్సరం మొత్తం ఆదివారం నాడు మాంసాహారం వదిలిపెట్టి, చక్కగా సూర్యుడి స్తోత్ర పారాయణం చేస్తే అందరూ బాగుంటారని సూచించారు.

Also Read : వసంత నవరాత్రులు చేయలేని వారు ఇలా చేయండి చాలు..

”ఇది తెలంగాణ ప్రజలంతా తెలుసుకోవాలి. ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చింది కాబట్టి సూర్యుడు రాజు అయ్యాడు. సూర్యుడు బాగుండాలి, రాజు బాగుండాలి అంటే.. ఆదివారం రోజున తెలంగాణలో చుక్క, ముక్క ముట్టుకోకపోతే బ్రహ్మాండంగా ఉండబోతోంది. కాబట్టి చుక్కలకు, ముక్కలకు ఆదివారం దూరంగా ఉంటే అధికారులకు కానీ, నాయకులకు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

ఆరోగ్యం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఇది నేను చెప్పింది కాదు, ఇది శాస్త్రంలో చెప్పిన మాట. రాజు చక్కగా పరిపాలన చేయాలంటే ఆదివార నియమం పాలకులు పాటించాలి, ప్రజలు పాటించాలి. ఆదివారం నాడు మాంసారాన్ని విసర్జించి సూర్య నమస్కారములతో ఆదిత్య హృదయాన్ని స్తోత్ర పారాయణం చేసిన వ్యక్తి శక్తిమంతుడు అవుతాడు.

ఈ సంవత్సరం విశ్వావసు. ఈ బ్రహ్మాండాన్ని తన దివ్య అద్భుత తేజోమయ కిరణాలతో ప్రకాశింపజేసే సూర్య నారాయణుడిని అనుగ్రహమే విశ్వావసు. సమస్తమైన జగత్తును తన కిరణాలతో ప్రకాశింపజేస్తాడు. అందుకే ఈ విశ్వావసు నామ సంవత్సరానికి దేవత ఎవరు అంటే అగ్నిస్వరూప ఆదిత్యుడే ఈ సంవత్సరానికి దేవుడు. అందుకే ప్రజలందరికి ఒక మంచి సూచన చేస్తున్నా.

ఈసారి ఉగాది ఆదివారం వచ్చింది. ఉడాదికి ఆది దేవత కూడా అగ్నిస్వరూప సూర్యుడు. ఈ సంవత్సరం ప్రజలంతా ఆదివారం నాడు మాంసాహారం వదిలిపెట్టి చక్కగా ఆదివారం రోజున సూర్యుడి స్తోత్ర పారాయణం చేయండి. అందరూ బాగుంటారు. లోకం బాగుంటుంది.

Also Read : ఉగాది నుంచే వసంత నవరాత్రులు.. కలశ స్థాపన అందరూ చేయొచ్చా.. ఏ రోజు ఏ అమ్మవారిని పూజించాలి?

ఆదివారం అంటే బోగానికి, ఆదివారం అంటే ఎంజాయ్ కి, ఆదివారం అంటే చేయకూడని పనులకు అనేటువంటి దృష్టిలో మనమంతా పడిపోయాం. మీరు బాగుపడాలి, మారాలి, మంచి రోజులు కావాలి, రోగాలు రావొద్దు అంటే బలం కావాలి. మన బలం, బలగం సూర్యుడే. కాబట్టి సూర్యారాధన చేయాలి. రాజు బాగుండాలి అంటే శక్తి కావాలి. ఆ రాజుకు శక్తి కావాలంటే మనమందరం కలిసి ఆదివారం నాడు ఉదయం లేవటం, ఆదిత్య హృదయం పారాయణం చేయటం, సూర్యుడి ఆరాధన ఎంత నియమంగా చేస్తే అంత బాగుంటుంది విశ్వావసు నామ సంవత్సరం” అని సిద్ధాంతి బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి చెప్పారు.