Horoscope Today : ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది..!

ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.

Horoscope Today : ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది..!

Updated On : April 11, 2025 / 1:41 AM IST

Horoscope Today : శుభగ్రహమైన గురువు ఈ రోజు మృగశిర నక్షత్రంపైకి ఆగమిస్తున్నాడు. కుజుడి నక్షత్రంపై గురువు అనుకూల ఫలితాలు ఇవ్వగలడు. సంపదలు అందిస్తాడు. గురు-చంద్రుల పరస్పర కేంద్ర స్థితి ఈ యోగానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నది. ఈ కాంబినేషన్‌ కారణంగా కర్కాటక రాశి వారికి కార్యసిద్ధి కలుగుతుంది. కన్య రాశి వారికి ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. కుజ రాశులైన మేషం, వృశ్చికం వారికి మేలు కలుగుతుంది.

Aries

Aries

మేషం: ప్రయాణాలు కలిసివస్తాయి. పనులు శ్రద్ధగా చేస్తారు. కుటుంబంతో సంతోసంగా ఉంటారు. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. స్థిరాస్తి లావాదేవీలు అనుకూలిస్తాయి. మాటతో అందరి మనసులూ గెలుచుకుంటారు. సూర్యారాధన మేలు చేస్తుంది.

Taurus

Taurus

వృషభం: చాలా పనుల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. స్నేహితులతో మనస్పర్ధలు రావచ్చు. గతంలో ఆగిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. విద్యార్థులకు విజయం చేకూరుతుంది. శివాలయాన్ని సందర్శించండి.

Gemini

Gemini

మిథునం: కుటుంబంతో సంతోషంగా గడపుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వస్త్ర వ్యాపారంలో ఉన్నవారు మంచి లాభాలు ఆర్జిస్తారు. ఆదాయం పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఒత్తిడిని జయిస్తారు. రామరక్ష స్తోత్రం పఠించండి.

Cancer

Cancer

కర్కాటకం: పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థుల విదేశీయాన ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. అనుకూల బదిలీకి అవకాశం ఉంది. సమయానికి సాయం చేసేవారు ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. దుర్గాదేవిని ఆరాధించండి.

Leo

Leo

సింహం: పిల్లలు చదువులో రాణిస్తారు. పనుల్లో పట్టుదల, ఏకాగ్రత కనబరుస్తారు. రాజకీయ, ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. అనుకూల స్థానచలన సూచన. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

Virgo

Virgo

కన్య: ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. రాబడి పెరుగుతుంది. రుణ బాధలు తొలగుతాయి. ఇతరుల ఒత్తిళ్లకు తలొగ్గకండి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

Libra

Libra

తుల: నిలిచిపోయిన పనులలో కదలిక వస్తుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు మంచి రోజు. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.

Scorpio

Scorpio

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సలహాలు, సంప్రదింపులకు ప్రాధాన్యమిస్తారు. ఇంట్లో వాతావరణం సంతృప్తిగా ఉంటుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. లక్ష్మీదేవి ఆరాధన మేలు చేస్తుంది.

Sagittarius

Sagittarius

ధనుస్సు: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంది. ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. కోర్టు పనుల్లో కొంత ఊరట లభిస్తుంది. శివారాధన శుభప్రదం.

Capricorn

Capricorn

మకరం: కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. పట్టుదల అవసరం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.

Aquarius

Aquarius

కుంభం: ప్రయాణాలలో కార్యసాఫల్యం ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. భూముల వ్యవహారంలో జాగ్రత్త వహిస్తారు. బంధువులతో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. సంయమనం పాటించడం అవసరం. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. ఇష్టదైవాన్ని ఆరాధించండి.

Pisces

Pisces

మీనం: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంగా ఉంటారు. కొత్త వస్తువులు, దుస్తులు కొంటారు. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. కోర్టు కేసులలో విజయం లభిస్తుంది. స్నేహితులు, బంధువులతో కార్య సాఫల్యం ఉంది. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008

Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్‌ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.