Utthana Ekadashi: నవంబర్ 1.. శనివారం.. ఉత్తాన ఏకాదశి.. ఇలా చేస్తే దరిద్రాలన్నీ తొలగి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి..!

చాలామంది కార్తీక మాసంలో స్వయం పాకం దానం ఇచ్చుకుంటూ ఉంటారు. ఉత్తాన ఏకాదశి రోజు ఇవ్వాల్సిన దానం....

Utthana Ekadashi: నవంబర్ 1.. శనివారం.. ఉత్తాన ఏకాదశి.. ఇలా చేస్తే దరిద్రాలన్నీ తొలగి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి..!

Updated On : November 1, 2025 / 1:03 AM IST

Utthana Ekadashi: నవంబర్ 1.. శనివారం.. శ్రీమహా విష్ణువు యోగ నిద్ర నుంచి మేలుకునే రోజు. ఉత్తాన ఏకాదశి. ఇవాళ ఏం చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుందో, సమస్త సంపదలు సిద్ధిస్తాయో, అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, అన్ని దారిద్ర బాధలు తొలగిపోతాయి తెలుసుకుందాం.

ఉత్తాన ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు స్నానం చేసే సమయంలో ఒక జిల్లెడు ఆకు కానీ ఒక మారేడు ఆకు కానీ తల మీద ఉంచుకుని తల స్నానం చేయాలి. కార్తీక మాసంలో తలంటు స్నానం చేయకూడదు. తలకు నూనె పెట్టుకుని తలంటు స్నానం చేయకూడదు. కేవలం తలమీద నీళ్లు మాత్రమే పోసుకోవాలి. కార్తీక మాసంలో తల స్నానం చేయాలి కానీ తలంటు స్నానం చేయకూడదు. ఉత్తాన ఏకాదశి రోజున అందరూ కూడా ఒక మారేడు దళం లేదా ఒక జిల్లేడు ఆకు శిరస్సు మీద పెట్టుకుని తల మీద నీళ్లు పోసుకోవాలి. లేదా ఒక రేగి పండు లేదా ఉసిరికాయ అయినా సరే.. తల మీద పెట్టుకుని స్నానం చేయాలి. అలా స్నానం చేస్తే సమస్త దరిద్రాలు తొలగిపోతాయి.

ఉత్తాన ఏకాదశి రోజు ఇవ్వాల్సిన ప్రత్యేకమైన దానం ఉంది. చాలామంది కార్తీక మాసంలో స్వయం పాకం దానం ఇచ్చుకుంటూ ఉంటారు. ఉత్తాన ఏకాదశి రోజు ఇవ్వాల్సిన దానం.. పాలు, పెరుగు, బియ్యం, పప్పు, అనపకాయ, దోసకాయ.. వీటిలో ఏవైనా సరే ఉత్తాన ఏకాదశి రోజున దానం ఇచ్చినా, విస్తరిలో ఉంచి పండితులకు దానం ఇచ్చినా అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.

అలాగే ఉత్తాన ఏకాదశి రోజు అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే వ్యూహ లక్ష్మి మంత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి. ఎందుకంటే శ్రీమహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేలుకునే రోజు కాబట్టి ఆరోజు వ్యూహలక్ష్మి మంత్రం చదివితే అష్ట లక్ష్ముల ఏకా కాలంలో అనుగ్రహిస్తారు.