Horoscope Today : ఈరోజు అదృష్టం వరిస్తుంది..! ఈ రాశుల వారికి లాభమే లాభం..!
శత్రువుల నుంచి కూడా సహకారం లభిస్తుంది. ఆర్థికంగా విశేష ప్రయోజనం పొందుతారు.

Horoscope Today : షేర్ మార్కెట్‌ను శాసించేది శని, గురు రాహువులే! ఈ మూడు గ్రహాలు ఈరోజు వివిధ అంశాల్లో బలహీన స్థితిని పొందడం వల్ల.. మార్కెట్ తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతుంది. వ్యక్తిగత రాశుల విషయానికి వస్తే.. ఈ గ్రహాల స్థితి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కట్టబెడితే, మరికొన్ని రాశులకు దురదృష్టాన్ని రిటర్న్ గిఫ్ట్‌గా ఇస్తుంది. వృషభం, తుల, మకర రాశులవారు లబ్ధి పొందితే, మేషం, కన్య, కుంభ రాశుల వారు నష్టాన్ని చవిచూస్తారు.

Aries
మేషం: సోదర వర్గంతో వైరం ఏర్పడుతుంది. ఎదుటివారి మాటలను అపార్థం చేసుకోవద్దు. మనసు స్థిరంగా ఉండదు. ఆర్థికంగా ఫర్వాలేదు. స్టాక్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. సంయమనం పాటించడం అవసరం. నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి.

Taurus
వృషభం: మీ ప్రతిభకు ప్రశంసలు వర్షిస్తాయి. కాదు అనుకున్న పని కూడా ఇట్టే పూర్తవుతుంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. పిల్లల విషయంలో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. దత్త స్తోత్రాలు పఠించండి.

Gemini
మిథునం: ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో కలహ వాతావరణం ఉంటుంది. మాట జాగ్రత్త! సాయంత్రానికి ప్రశాంతత నెలకొంటుంది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Cancer
కర్కాటకం: ఆర్థికంగా ఒడుదొడుకులు ఉంటాయి. అనాలోచిత నిర్ణయాలకు ఆస్కారం ఉంది. సంయమనం పాటించడం అవసరం. రుణదాతల ఒత్తిళ్లు ఉంటాయి. సాయంత్రానికి కొంత ఊరట లభిస్తుంది. హనుమత్ ఆరాధన శుభప్రదం.

Leo
సింహం: ఆరోగ్యం విషయంలో అనవసరమైన ఆందోళనలు చెందుతారు. ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ఎదుటివారిని మెప్పించడమే ఈ రోజు పనిగా పెట్టుకుంటారు. శారీరక శ్రమ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆదిత్య హృదయం పఠించండి.

Virgo
కన్య: నలుగురిలో నిందలు పడాల్సి వస్తుంది. ఎవరు మీవారో, ఎవరు పరాయివారో అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. ఆవేశంలో మాట జారకండి. దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవడం అవసరం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Libra
తుల: ఈ రోజు అదృష్టం వరిస్తుంది. శత్రువుల నుంచి కూడా సహకారం లభిస్తుంది. ఆర్థికంగా విశేష ప్రయోజనం పొందుతారు. ఆహార వ్యవహారాల్లో సమయపాలన అవసరం. భూ లావాదేవీల్లో లాభం పొందుతారు. లక్ష్మీధ్యానం శుభప్రదం.

Scorpio
వృశ్చికం: అనురాధ నక్షత్రం ఉన్నవారికి ఇది మంచి రోజు. భూ వ్యవహారాలు దాదాపు సెటిల్ అవుతాయి. చర్చలు సఫలం అవుతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం ప్రతికూలత ఉంది. ఆధ్యాత్మిక బలం అవసరం. హనుమాన్ చాలీసా పఠించండి.

Sagittarius
ధనుస్సు: ఒక ప్రయత్నం విజయవంతం అవుతుంది. పూర్వాషాఢ నక్షత్రం ఉన్నవారికి ఈ రోజు అదృష్టం వరిస్తుంది. పది పైసల శ్రమకు రూపాయి లబ్ధి పొందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. నరసింహస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

Capricorn
మకరం: ఈ రోజు మీరు పట్టిందల్లా బంగారమే! తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని అంతే పక్కాగా అమల్లో పెడతారు. పదిమంది విశ్వాసం చూరగొంటారు. ఆరోగ్యంలో మంచి మార్పు వస్తుంది. రామాలయాన్ని సందర్శించండి.

Aquarius
కుంభం: కష్టానికి తగ్గ గుర్తింపు ఉండదు. ఒత్తిళ్లు అధికమవుతాయి. ప్రశంసించిన వారే నిందిస్తారు. ఇంట్లో కలహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం. కీలక నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.

Pisces
మీనం: ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయి. ఏ విషయంలోనూ ఒక నిర్ణయానికి రాలేకపోతారు. రోజంతా చికాకుగానే గడిచిపోతుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అవసరం. దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. హనుమాన్ చాలీసా పఠించండి.
(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.