OpenAI: కష్టాల కడలిలో ChatGPT.. అంతలా రికార్డులు సృష్టించి ఇప్పుడేమైందో తెలుసా?

ఓపెన్‌ఏఐ తమ చాట్‌జీపీటీ కోసం రోజుకి రూ.5.80 కోట్ల ($700,000) చొప్పున ఖర్చు చేస్తోంది. దీంతో శరవేగంగా నిధులు ఖర్చయిపోతున్నాయి.

OpenAI: కష్టాల కడలిలో ChatGPT.. అంతలా రికార్డులు సృష్టించి ఇప్పుడేమైందో తెలుసా?

OpenAI - ChatGPT

OpenAI – ChatGPT: అమెరికాలోని కృత్రిమ మేధా సంస్థ ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్‌ (Sam Altman) తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడే ప్రమాదం పొంచి ఉందని అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ ఓ నివేదికలో పేర్కొంది. ఆయన సంస్థ 2024 డిసెంబరులోపు దివాళా తీసే ముప్పు ఉందని చెప్పింది.

ఓపెన్‌ఏఐ ఓ లాభాపేక్షలేని సంస్థ. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న చాట్‌జీపీటీ (ChatGPT)ని ఓపెన్‌ఏఐ అభివృద్ధి చేసింది. ఓపెన్‌ఏఐ తమ చాట్‌జీపీటీ కోసం రోజుకి రూ.5.80 కోట్ల ($700,000) చొప్పున ఖర్చు చేస్తోంది. దీంతో శరవేగంగా నిధులు ఖర్చయిపోతున్నాయి.

జీపీటీ 3.5 (GPT-3.5), జీపీటీ 4 (GPT-4) ద్వారా నిధుల సమీకరణకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం తగినంత రెవెన్యూను రాబట్టలేకపోతోంది. చాట్‌జీపీటీ యాప్‌ను 2022 నవంబరులో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. చరిత్రలో ఏ యాప్‌కూ రానంత స్పందన దీనికి వచ్చింది.

మొదటి దశలో యూజర్లు విపరీతంగా ఎగబడ్డప్పటికీ, కొన్ని వారాలుగా చాట్‌జీపీటీని వాడుతున్న వారి సంఖ్య తగ్గుతూ వస్తోందని SimilarWeb పేర్కొంది. ఈ ఏడాది జూన్‌తో పోల్చితే గత నెలలో చాట్‌జీపీటీ యూజర్ల సంఖ్య 12 శాతం తగ్గింది. 1.7 బిలియన్లుగా ఉన్న యూజర్లు ఇప్పుడు 1.5 బిలియన్లకు పడిపోయారు. ఓపెన్‌ఏఐ ఎదుర్కొంటున్న సమస్యల్లో ఆ సంస్థ ఏపీఐలు(APIs- Application Programming Interface) కూడా ఒక ప్రధాన సమస్యగా మారాయి.

ఇక చాట్‌జీపీటీ ఎందుకు?

చాట్‌జీపీటీని వాడకూదని కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను సూచించాయి. అవే కంపెనీలు ఇప్పుడు ఓపెన్‌ఏఐకు చెందిన ఏపీఐల ద్వారా సొంత ఏఐ చాట్‌బాట్లను తమ సంస్థలకు అనుగుణంగా అభివృద్ధి చేసుకుంటున్నాయి. ఏ లైసెన్స్ సమస్యలూ లేకుండా, ప్రస్తుతం చాలా ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎమ్ మోడళ్లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తెలిపింది.

దీంతో సంస్థలు తమ కంపెనీలకు అనుగుణంగా వాటిని వాడుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో మెటాకు చెందిన Llama 2ను కమర్షియల్ గానూ వాడుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతో, ఇక ఓపెన్‌ఏఐ అందిస్తున్న ఆఫర్ల జోలికి యూజర్లు ఎందుకు వెళతారు. అంతగాక, ఓపెన్‌ఏఐకు చెల్లింపులు చేసుకోవాలి.

అందులోనూ కొన్నింటికి ఓపెన్‌ఏఐ పరిమితులు విధించింది. ఓపెన్‌ఏఐ ఇప్పటికీ లాభదాయక సంస్థగా మారలేదు. చాట్‌జీపీటీని అభివృద్ధి చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆ సంస్థ అంతకు ముందు ఎన్నడూ నష్టపోనంతగా మే నెలలో రూ.44 వేల కోట్లు నష్టపోయింది. మైక్రోసాఫ్ట్ ఈ ఏడాదికి గానూ ఓపెన్‌ఏఐలో రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది.

ప్రస్తుతం ఆ నిధులతోనే ఓపెన్‌ఏఐ ప్రస్తుతం నెట్టుకొస్తుంది. ఓపెన్‌ఏఐ 2023 ఏడాదికిగానూ వార్షిక ఆదాయం రూ.1,659 కోట్ల మాత్రమే సంపాదించే అవకాశం ఉందని అంచనా. 2024లో ఆ సంస్థ వార్షిక ఆదాయం రూ.8,295 కోట్లు మాత్రమే ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

OnePlus Ace 2 Pro Launch : ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌తో వన్‌ప్లస్ Ace 2ప్రో ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ఆగస్టు 16నే లాంచ్..!