కరోనా ఎఫెక్ట్: రిలయన్స్ జియో భారీ ఆఫర్లు

కరోనావైరస్(COVID-19) వ్యాప్తి కాకుండా ఉండేందుకు దేశంలోని చాలా సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రాకుండా.. ఇంటి నుంచే పని చెయ్యాలని కోరుతుంది. అటువంటి సమయాల్లో ఎక్కువ డేటా మరియు కాలింగ్ అవసరం ఉంటుంది.
ఈ క్రమంలో మొబైల్ డేటాపై ఆధారపడేవారికి సహాయకరంగా ఉండేందుకు దేశంలోని అత్యుత్తమ టెలికామ్ ఆపరేటర్‌గా ఉన్న జియో.. మహమ్మారి కారణంగా ఎక్కువ మంది ఇంటి నుండి పని చేసేందుకు వీలుగా అదనపు ప్రయోజనాలతో సవరించిన 4జీ డేటా వోచర్‌లను జియో ప్రకటించింది.
రూ.11-101 విలువైన 4జీ డేటా ఓచర్లతో రెట్టింపు డేటా, ఇతర నెట్‌వర్క్‌లకు అదనపు టాక్‌టైమ్ సదుపాయం కల్పిస్తున్నట్లు రిలయన్స్ జియో తెలిపింది. అధికవేగం డేటా పరిమితి ముగిశాక 64 కేబీపీఎస్ వేగంతో అపరిమితంగా వాడుకోవచ్చు. రూ.11కు 800 ఎంబీ అధికవేగం డేటా, 75 నిమిషాల టాక్‌టైమ్; రూ.21కి 2జీబీ డేటా 200 ని.టాక్‌టైమ్, రూ.51కి 6జీబీ డేటా, 500 ని.టాక్‌టైమ్, రూ.101కి 12 జీబీ డేటా, 1000 ని.టాక్‌టైమ్ లభిస్తుంది.
సవరించిన వోచర్లు రూ .11, రూ .21, రూ .51, రూ .101 ఆఫర్‌లను అప్‌డేట్ చేస్తాయి, కానీ రూ. 251 వోచర్‌కు మాత్రం అదే ఆఫర్లు.