భారత్‌తో ఒప్పందానికి ముందే షాకిచ్చిన ట్రంప్.. ఇకపై డీల్స్ లేవు, అన్ని దేశాలకూ లెటర్లు… టార్గెట్ ఎంతంటే?
గత నెలలోనే ట్రంప్ భారత్‌తో ఒక "అద్భుతమైన వాణిజ్య ఒప్పందం" కుదిరే అవకాశం ఉందని, దాని ద్వారా భారత మార్కెట్‌ను తెరుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Donald Trump
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారవుతుందని అందరూ ఎదురుచూస్తుండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని బాంబు పేల్చారు. “ఇకపై దేశాలతో చర్చలు, ఒప్పందాలు ఉండవు. అమెరికాతో వ్యాపారం చేయాలంటే ఎంత టారిఫ్ (సుంకం) కట్టాలో మేమే లెటర్‌లో రాసి పంపిస్తాం” అని ఆయన ప్రకటన చేశారు.
భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
ట్రంప్ కొత్త ‘లెటర్’ పాలసీ ఇదే..
ఇప్పటివరకు దేశాలతో చర్చలు జరిపి వాణిజ్య ఒప్పందాలు చేసుకునే పద్ధతికి ట్రంప్ స్వస్తి పలకాలని భావిస్తున్నారు. తన కొత్త విధానాన్ని ఆయన వివరించారు. “ప్రపంచంలో 170కి పైగా దేశాలున్నాయి. ప్రతి ఒక్కరితో ఒప్పందం చేసుకోవడం చాలా కష్టం అందుకే, మేమే ఒక సులభమైన డీల్ ప్రతిపాదిస్తున్నాం. ప్రతిరోజూ 10 దేశాలకు చొప్పున లెటర్లు పంపిస్తాం. అందులో వారు మాతో వ్యాపారం చేయాలంటే 20% లేదా 30% టారిఫ్ కట్టాల్సి ఉంటుందని స్పష్టంగా చెబుతాం” అని అన్నారు.
ఈ విధానం “అమెరికా ఫస్ట్” నినాదంలో భాగమేనని, అమెరికాకు నష్టం కలిగించే వాణిజ్యాన్ని అరికట్టడమే దీని లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు.
Also Read: దారుణం.. ఆ గ్రామంలో సింగిల్ కిడ్నీతో బతుకుతున్న జనాలు.. సంచలన విషయాలు వెల్లడి
ఇప్పటికే వణికిపోతున్న దేశాలు
ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ ఇప్పటికే అనేక దేశాలు రుచి చూశాయి. ఆయన భారీ టారిఫ్ విధించిన ఇవే..
థాయ్‌లాండ్ – 36%
ఇండొనేషియా – 32%
తైవాన్ (ముఖ్యంగా చిప్స్ తయారీ చేస్తుంది) – 32%
దక్షిణ కొరియా – 25%
జపాన్ – 24%
యూరోపియన్ యూనియన్ – 20%
గత నెలలోనే ట్రంప్ భారత్‌తో ఒక “అద్భుతమైన వాణిజ్య ఒప్పందం” కుదిరే అవకాశం ఉందని, దాని ద్వారా భారత మార్కెట్‌ను తెరుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
కానీ, తాజా ప్రకటనతో ఈ ఒప్పందం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఈ డీల్ పట్టాలెక్కకపోతే, ట్రంప్ తన కొత్త ‘లెటర్’ పాలసీని భారత్‌పై కూడా ప్రయోగించే ప్రమాదం లేకపోలేదు.
ఈ ఏకపక్ష విధానం ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) నిబంధనలకు విరుద్ధమని, ఇది గ్లోబల్ ట్రేడ్ వార్‌కు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ భారత్‌తో ప్రత్యేక వాణిజ్య ఒప్పందం కుదరకపోతే, ఇతర దేశాలలాగే భారత దిగుమతులపై కూడా ట్రంప్ భారీ టారిఫ్‌లను విధించే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాబోయే రోజుల్లో భారత్ దౌత్యపరంగా ఎలా ముందుకు వెళ్తుందనే దానిపైనే మన ఎగుమతుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.