Gautam Adani : 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో గౌతమ్ అదానీ.. ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ తర్వాతే ఈయనే..!
Gautam Adani : ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీ చేరారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో కొత్తగా గౌతమ్ అదానీ చేరారు.

Gautam Adani Joins Elon Musk, Jeff Bezos In Exclusive 100 Billion Dollars Club
Gautam Adani : ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీ చేరారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో కొత్తగా గౌతమ్ అదానీ చేరారు. ప్రపంచ టాప్ 10 కుబేరులైన ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ సరసన అదానీ చేరారు. అయితే రిలయన్స్ అధినేత, పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ 99 బిలియన్ డాలర్ల సంపదతో వెనకపడ్డారు. టాప్-10 జాబితాలో అంబానీ చోటు కోల్పోయారు. గత రెండేళ్లలో అదానీ గ్రూపు షేర్లు 1000 శాతానికి ఎగిశాయి. అదానీ సంపద 23.5 బిలియన్ డాలర్లు పెరిగింది. దాంతో ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అదానీకి చోటు దక్కింది. బిలియనీర్ ఇండెక్స్‌లో అంబానీని అదానీ గ్రూపు అధిగమించింది. అంబానీ సంపద 9.03 బిలియన్ల డాలర్ల పెరుగుదలతో మొత్తం ఆదాయం 99 బిలియన్ డాలర్లకు చేరింది. దాంతో ముఖేశ్ అంబానీ 11వ స్థానంలో నిలిచారు. కొన్నిరోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్‌లు ఆశాజనకంగా ఉన్నాయి.
అదానీ గ్రూప్ స్టాక్స్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో బలపడ్డాయి. అదానీ విల్మార్ షేర్లు దాదాపు 43శాతం లాభపడ్డాయి. ఫ్లాగ్‌షిప్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ దాదాపు 24శాతం లాభపడింది. అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 29.5శాతం కన్నా ఎక్కువ పెరిగాయి. అదానీ పోర్ట్ షేర్లు దాదాపు 11శాతం పెరగగా, అదానీ ట్రాన్స్‌మిషన్ దాదాపు 4శాతం పెరిగాయి. అదానీ పవర్ NSE షేర్లు రికార్డు స్థాయిలో దాదాపు 66శాతం పెరిగాయి. మరోవైపు.. ఏప్రిల్ 1న NSEలో అదానీ విల్మార్, అదానీ పవర్, అదానీ పోర్ట్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మార్కెట్లలో భారీ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అదానీ స్టాక్స్ లాభాల బాట పట్టాయి. 1988లో మొదలైన అదానీ గ్రూప్ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ US 151 బిలియన్ డాలర్లుగా ఉంది. గ్యాస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్, పవర్ జనరేషన్, డిస్ట్రిబ్యూషన్ (ఓడరేవు, విమానాశ్రయాలు, షిప్పింగ్, రైలు) పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలున్నాయి. మైనింగ్, వనరులు, ఇతర రంగాల్లోనూ అదానీ పెట్టుబడులు ఉన్నాయి.

Gautam Adani Joins Elon Musk, Jeff Bezos In Exclusive 100 Billion Dollars Club
బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ప్రకారం.. ఎలక్ట్రిక్ వెహికల్ దిగ్గజం టెస్లా CEO ఎలోన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన నికర విలువ 273 బిలియన్ డాలర్లకు పెరిగింది అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 188 బిలియన్ డాలర్ల సంపదతో సెకండ్ ర్యాంకులో నిలిచారు. LVMH మొయెట్ హెన్నెస్సీ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 148 బిలియన్ డాలర్ల సంపదతో 3వ స్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, బెర్క్‌షైర్ హాత్వే CEO వారెన్ బఫెట్ బిలియనీర్ జాబితాలో వరుసగా 133 బిలియన్ డాలర్లు, 127 బిలియన్ డాలర్ల నికర విలువతో 4, 5వ స్థానాల్లో నిలిచారు. గూగుల్, లారీ పేజ్ 125 బిలియన్లతో 6వ స్థానంలో.. సెర్గీ బ్రిన్ సహ వ్యవస్థాపకులు 119 బిలియన్లతో 7వ స్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ మాజీ CEO, లాస్ ఏంజిల్స్ క్లిప్ స్టీవ్ బాల్మెర్ 108 బిలియన్ డాలర్లతో 8వ స్థానంలో నిలవగా, ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ 103 బిలియన్ డాలర్లతో 9వ స్థానంలో నిలిచారు.
Read Also : Gautam Adani : గౌతమ్ అదానీ నెం.1.. ఆసియాలోనే అపర కుబేరుడు.. అంబానీని వెనక్కి నెట్టేశాడుగా..!