Gold Rate : తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. తులం గోల్డ్ రేటు ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో

Gold Rate : తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..  తులం గోల్డ్ రేటు ఎంతంటే?

Gold

Gold And Silver Price : బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. దీంతో బంగారం కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే, ఆదివారం బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. గోల్డ్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలుసైతం స్థిరంగా కొనసాగుతున్నాయి.

 

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850 వద్దకు చేరుకోగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,930 వద్దకు చేరింది.
  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,000 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 73,080.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.66,850 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 72,930.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.67,700 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.72,760.

 

  • స్థిరంగా వెండి ధర ..
    దేశ వ్యాప్తంగా వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.87,500 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 87,500. కోల్ కత్తా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.84,000 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 84,000 వద్ద కొనసాగుతుంది.

 

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.