Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. దీంతో ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం..

Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఇలా..

Gold

Gold and Silver Latest Prices : దేశవ్యాప్తంగా బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. శనివారం గోల్డ్ ధర భారీగా పెరగ్గా.. ఆదివారం, సోమవారాల్లో బంగారం ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. దీంతో ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 58,750 వద్ద కొనసాగుతుంది. మరోవైపు వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ. 100 తగ్గింది.

Gold

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. దీంతో ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,750కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 64,090 వద్ద కొనసాగుతుంది.

Gold

  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,900 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 64,240.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో .. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 58,750 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 64,090.
    చెన్నైలో 10గ్రాముల బంగారంపై రూ. 10 తగ్గింది. దీంతో అక్కడ 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.59,390 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.64,790గా నమోదైంది.

Gold

  • వెండి ధర ..
    దేశవ్యాప్తంగా వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.76,900గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 76,900 కు చేరింది. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.73,500 కాగా, బెంగళూరులో మాత్రం కిలో వెండిపై రూ.100 పెరిగింది. దీంతో అక్కడ కిలో వెండి ధర రూ.72,850 కి చేరింది.

Gold

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.