Gold Price Today : రూ.70వేలకు చేరువలో తులం బంగారం ధర.. వారం రోజుల్లో ఎంత పెరిగిందో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర మరోసారి భారీగా పెరిగింది. దీంతో ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో ..

Gold Price Today : రూ.70వేలకు చేరువలో తులం బంగారం ధర.. వారం రోజుల్లో ఎంత పెరిగిందో తెలుసా?

Gold Rate

Updated On : March 6, 2024 / 11:58 AM IST

Gold And Silver Price Today : బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. గత మూడు రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతూ వస్తోంది. 24క్యారెట్ల పది గ్రాముల బంగారంపై వారం రోజుల్లోనే 2,300 మేర పెరిగింది. దీంతో రికార్డు గరిష్టాలకు బంగారం ధర చేరింది. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయనే సూచనలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తొలగక పోవడం, కేంద్రీయ బ్యాంకుల నుంచి పసిడి నిల్వలు పెంచుకునేందుకు లభిస్తున్న ఆసక్తి, క్రిప్టోకరెన్సీల విలువ గణనీయంగా పెరగడంతో దానిని హెడ్జింగ్ చేసుకునేందుకు పసిడిపైనా పెట్టుబడులు పెడుతుండటం వల్లనే బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరొకొన్ని రోజుల పాటు గోల్డ్ ధర పెరిగే అవకాశం ఉందని, రికార్డు గరిష్టాలకు బంగారం ధర చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలాఉంటే.. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 250 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారంపై రూ. 280 పెరిగింది. మరోవైపు వెండి స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ. 200 తగ్గింది.

Gold

  • తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర మరోసారి భారీగా పెరిగింది. దీంతో ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,700కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 65,130 మార్క్ వద్దకు చేరింది.

Gold

  • దేశంలోని ప్రధాన నగరాల్లో ..
    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 65,280.
    ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 59,700 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 65,130.
    చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.60,400 మార్క్ కు చేరింది. 24క్యారెట్ల గోల్డ్ రూ.65,890గా నమోదైంది.

Gold

  • తగ్గిన వెండి ధర ..
    దేశవ్యాప్తంగా వెండి ధర స్వల్పంగా తగ్గింది. మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ. 200 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.78,000 వద్ద కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 78,000 కు చేరింది. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.74,500 కాగా, బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,750 వద్ద కొనసాగుతుంది.

Gold

  • పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.