రూ.2వేలు తగ్గిన బంగారం ధర

రూ.2వేలు తగ్గిన బంగారం ధర

Updated On : October 13, 2019 / 1:27 PM IST

బంగారం ధర క్రమంగా పడిపోతుంది. దీపావళి పండుగకు ప్రజలకు తక్కువ ధరలోనే బంగారం దొరకనుంది. రోజురోజుకూ పెరుగుతూ వచ్చిన పసిడి గ్లోబల్ మార్కెట్‌లో పతనం కావడం విశేషం. ఎంసీఎక్స్ మార్కెట్‌లో కాంట్రాక్ట్ ధర శుక్రవారం నాటికి 0.76 శాతం తగ్గుదలతో 10 గ్రాములకు రూ.37,870గా ఉంది.

తాజాగా తగ్గిన ధర సెప్టెంబర్ నెలలో పలికిన గరిష్ట ధరతో పోలిస్తే 10 గ్రాములకు రూ.2,100 పడిపోయింది. వెండి ధర 0.44 శాతం తగ్గుదలతో రూ.45,222కు పతనమైంది. సెప్టెంబరు నెల గరిష్ట స్థాయి రూ.51,489తో పోలిస్తే ఇప్పుడు ధర రూ.6,200 కంటే పైగా పతనమైంది. 

బంగారం ధర మార్పులపై మార్కెట్ నిపుణులు సానుకూలంగానే ఉన్నారు. అమెరికా, చైనా మధ్య ఒప్పందాల కారణంగా స్వల్పకాలిక ఏర్పడిన సమస్యలు తీరినా.. దీర్ఘకాల సమస్యలు ఎదురవుతూనే ఉండొచ్చనే భావన వినిపిస్తోంది. డిసెంబర్‌లో చైనా దిగుమతులపై సుంకాలు విధించాలని అమెరికా భావిస్తోంది. ఈ అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి పూర్తి స్థాయి స్పష్టత లేదు. 

భారత్‌లో ఈ సంవత్సరం బంగారం ధర క్రమంగా 20 శాతం పెరుగుతూనే ఉంది. ఇటీవల ధరల్లో తగ్గుదల ఉండటంతో దీపావళికి పసిడి కొనుగోళ్లు పెరగొచ్చనే అంచనాలు కనిపిస్తున్నాయి.