మహిళలకు శుభవార్త……తగ్గిన బంగారం ధర

  • Published By: murthy ,Published On : November 19, 2020 / 08:02 PM IST
మహిళలకు శుభవార్త……తగ్గిన బంగారం ధర

Updated On : November 19, 2020 / 8:13 PM IST

gold silver rates declined : గత కొద్దిరోజులుగా పెరుగూ వెళుతున్న బంగారం ధర రెండు రోజులుగా తగ్గు ముఖం పడుతోంది. కరోనా లాక్ డౌన్ తర్వాత బంగారం కొనాలంటే భయపడేలా రేట్లు పెరిగిపోయాయి. ఒకానోక దశలో 50 వేలుదాటి పోయింది.

గత రెండు రోజులుగా దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా తగ్గడం వలన దేశీయంగా కూడా ధరలు కూడా తగ్గినట్టు నిపుణులు చెప్తున్నారు. రాజధాని ఢిల్లీలో గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.248 తగ్గి రూ.49,741కి చేరింది.



గ‌త ట్రేడ్‌లో 10 గ్రాముల ప‌సిడి ధ‌ర రూ.49,962 వ‌ద్ద ముగిసింది. ఇక వెండి ధ‌ర కూడా గురువారం స్వ‌ల్పంగా తగ్గింది. ఢిల్లీలో కిలో వెండి ధ‌ర రూ.853 త‌గ్గి రూ.61,184కు చేరింది. గ‌త ట్రేడ్‌లో కిలో వెండి ధ‌ర రూ.62,037 వ‌ద్ద ముగిసింది. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఇవాళ ఔన్స్ బంగారం ధ‌ర 1861 అమెరిక‌న్ డాల‌ర్లు, ఔన్స్ వెండి ధ‌ర 24.02 అమెరిక‌న్ డాల‌ర్‌లు ప‌లికింది.