HDFC Bank Q1 Results : HDFC Q1 ఫలితాలు.. 21 శాతంగా ఎగబాకి రూ.9579 కోట్లు లాభం!

దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంకుగా పేరొందిన HDFC బ్యాంక్‌ ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి సమీకృత నికర లాభం పెరిగింది.

HDFC Bank Q1 Results : HDFC Q1 ఫలితాలు.. 21 శాతంగా ఎగబాకి రూ.9579 కోట్లు లాభం!

Hdfc Bank Q1 Results Profit Rises 19% Yoy To Rs 9,576 Crore; Nii Up 15%

Updated On : July 17, 2022 / 12:36 AM IST

HDFC Bank Q1 Results : దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంకుగా పేరొందిన HDFC బ్యాంక్‌ ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి సమీకృత నికర లాభం పెరిగింది. ఏడాది ప్రాతిపదికన 21 శాతం ఎగబాకి రూ.9,579 కోట్లకు లాభానికి చేరుకుంది. గత ఏడాదిలో నమోదైన రూ.7,729.64 కోట్లతో పోలిస్తే.. 20 శాతానికి పైగా అధికంగా పెరిగి రూ.9,159.99 కోట్లుగా రికార్డైంది. మార్చితో ముగిసిన 3 నెలల్లో నమోదైన మొత్తం రూ.10,055 కోట్లతో పోలిస్తే ఈసారి తగ్గిందనే చెప్పాలి. బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 14.5 శాతం పెరిగింది. దాంతో రూ.17 వేల కోట్ల నుంచి రూ.19,481 కోట్లకు చేరుకుంది.

ఫలితంగా నికర వడ్డీ మార్జిన్‌ 4 శాతంగా పెరిగింది. HDFC బ్యాంక్‌కు ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం 35 శాతం పెరిగింది. తద్వారా రూ.7,699.99 కోట్లకు చేరుకుంది. ఫారిన్‌ ఎక్సేంజ్‌ డెరివేటివ్‌ ఆదాయం పెరగడంతో కూడా కలిసి వచ్చింది. గత త్రైమాసికంలో డిపాజిట్లు 19 శాతంగా పెరిగాయి. కొత్తగా 26 లక్షల మంది డిపాజిట్లు చేయడంతో బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తుల 1.47 శాతం నుంచి 1.28 శాతానికి దిగిపోయాయి. అత్యధికంగా వ్యవసాయ రంగానికి సంబంధించినవే ఉండటం విశేషం.

Hdfc Bank Q1 Results Profit Rises 19% Yoy To Rs 9,576 Crore; Nii Up 15% (1)

Hdfc Bank Q1 Results Profit Rises 19% Yoy To Rs 9,576 Crore; Nii Up 15%

అంతేకాదు.. వ్యవసాయపరంగా వచ్చిన వాటా 1.26 శాతం నుంచి 1.06 శాతానికి తగ్గాయి. మొండి బకాయిలను తగ్గించుకోవడానికి బ్యాంక్‌ చేసిన కేటాయింపులతో రూ.4,830.84 కోట్ల నుంచి రూ.3,187. 73 కోట్ల వరకు తగ్గాయి. గత త్రైమాసికంలో కొత్తగా 36 శాఖలను HDFC బ్యాంక్‌ ప్రారంభించింది. 10,932 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకుంది. దీంతో మొత్తం బ్రాంచ్‌ల సంఖ్య 6 వేలకు చేరాయి. HDFC బ్యాంక్‌ అనుబంధ సంస్థ HDFC సెక్యూరిటీ పన్నులు చెల్లించిన అనంతరం నికర లాభం రూ.251.10 కోట్ల నుంచి రూ.189.30 కోట్లకు తగ్గింది.

Read Also : HDFC Bank : హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్‌ కస్టమర్ల అకౌంట్లలో కోట్ల రూపాయలు జమ..ఖాతాదారులు షాక్