ICICI Bank iFinance : ఐసీఐసీఐ కొత్త ‘ఐఫైనాన్స్’ సర్వీసు.. మీ బ్యాంకు ఏదైనా.. అన్ని అకౌంట్లను ఒకే చోట చూసుకోవచ్చు..!
ICICI Bank iFinance : ఐసీఐసీఐ బ్యాంక్ 'ఐఫైనాన్స్' అద్భుతమైన సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని బ్యాంకుల కస్టమర్లు తమ సేవింగ్స్, కరెంట్ అకౌంట్లను ఒకేచోట యాక్సస్ చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది.

ICICI Bank launches ‘iFinance’, a single-view for savings and current accounts across banks
ICICI Bank iFinance : మీ బ్యాంకు అకౌంట్ ఏదైనా సరే.. ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా పర్వాలేదు. ఒకే బ్యాంకు అకౌంట్ అనే సంబంధం లేకుండా అన్ని బ్యాంకుల కస్టమర్లు తమ అకౌంట్లకు సంబంధించిన అన్ని సర్వీసులను ఒకేచోట యాక్సస్ చేసుకోవచ్చు. అది ఎలా అంటారా? ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ (ICICI Bank) సింగిల్ వ్యూ ఐఫైనాన్స్ (iFinance) అనే కొత్త సర్వీసును ప్రకటించింది. ఈ కొత్త సర్వీసు ద్వారా కోట్లాది మంది కస్టమర్లు-రిటైల్ కస్టమర్లు తమ సేవింగ్స్, కరెంట్ అకౌంట్లను సింగిల్ వ్యూలో ఒకే చోట అన్ని వివరాలను పొందవచ్చు.
ఈ మేరకు ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్ అగ్రిగేటర్ ఎకోసిస్టమ్ ద్వారా బ్యాంక్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో (iMobile Pay) యాప్, రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ (RIB), కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ (CIB) సహా ఇతర సర్వీసులను ‘ఐఫైనాన్స్’ సర్వీసు నుంచి ఇతర బ్యాంకుల కస్టమర్‌లు కూడా ప్రయోజనం పొందవచ్చు. వ్యాపారాల కోసం బ్యాంక్ మొబైల్ యాప్ (InstaBIZ) కూడా అందిస్తోంది. ఈ యాప్ ద్వారా వ్యాపార సంబంధిత లావాదేవీలను డిజిటల్‌గా, ఇన్‌స్టంట్‌గా నిర్వహించుకోవచ్చు.
‘iFinance’ సర్వీసుతో అన్ని బ్యాంకు అకౌంట్ల కోసం సింగిల్-వ్యూ డ్యాష్‌బోర్డ్‌ను అందిస్తుంది. వినియోగదారులు అకౌంట్ బ్యాలెన్స్‌లను చెక్ చేయవచ్చు. లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను పొందవచ్చు. అంతేకాదు.. బ్యాంకు అకౌంట్ స్టేట్‌మెంట్‌లను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ డ్యాష్‌బోర్డ్ యూజర్లకు గణనీయమైన సౌకర్యాన్ని అందిస్తుంది. కస్టమర్లు తమ ఖర్చులపై మెరుగైన కంట్రోల్ కలిగి ఉండటానికి వారి ఆర్థిక వ్యవహారాలను మానిటరింగ్ చేసేందుకు సహకరిస్తుంది.
అన్ని బ్యాంకుల కస్టమర్లకు ఒకేచోట ఓపెన్ బ్యాంకింగ్ :
ఐఫైనాన్స్ సర్వీసు లాంచ్‌పై ఐసీఐసీఐ బ్యాంక్ డిజిటల్ ఛానెల్స్ హెడ్ సిధరత మిశ్రా మాట్లాడుతూ.. ‘ICICI బ్యాంక్‌లో మా కస్టమర్‌లకు భవిష్యత్, వినూత్న డిజిటల్ పరిష్కారాలను అందించడానికి కట్టుబడి ఉన్నాం. ‘iFinance’ సర్వీసు ద్వారా కస్టమర్‌లతో పాటు ఇతర బ్యాంకుల కస్టమర్‌లు కూడా వారి అకౌంట్ డేటాను ఒకే చోట వీక్షించేందుకు వీలు కల్పిస్తున్నాం. వారి ఫైనాన్స్‌పై మెరుగైన కంట్రోల్ అందిస్తున్నాం. అకౌంట్ అగ్రిగేటర్ పర్యావరణ వ్యవస్థ ద్వారా కస్టమర్‌లకు ఓపెన్ బ్యాంకింగ్ సౌలభ్యాన్ని అందించడమే మా ప్రధాన ఉద్దేశ్యం.
ఈ ప్రత్యేక ఫీచర్ వినియోగదారులకు సురక్షితమైన లావాదేవీలు చేసుకునేలా వారి ఖర్చుల విధానాలను విశ్లేషించడం ద్వారా వారి ఖర్చులను నిర్వహించుకునే సదుపాయాన్ని కూడా అందిస్తుంది. ఐఫైనాన్స్ సదుపాయం మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. బ్యాంకు కస్టమర్లు తమ అకౌంట్ సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ వినియోగదారులు తమ ఆర్థిక వ్యవహారాలను సౌకర్యవంతంగా పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి సాయపడుతుందని విశ్వసిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.

ICICI Bank iFinance Service
ఐఫైనాన్స్ ముఖ్య ఫీచర్లు ఇలా యాక్సస్ చేసుకోవచ్చు :
* అన్ని అకౌంట్లను లింక్ చేసి వీక్షించవచ్చు : వినియోగదారులు తమ సేవింగ్, కరెంట్ అకౌంట్లను అన్ని బ్యాంకులతో సురక్షితంగా లింక్ చేయవచ్చు. అకౌంట్ బ్యాలెన్స్ ఒకే చోట చెక్ చేసుకోవచ్చు.
* ఆదాయం, వ్యయాల స్టేట్‌మెంట్ : ఈ సదుపాయంతో వినియోగదారులు తమ ఆదాయం, వ్యయాల పూర్తి వివరాలను పొందవచ్చు. ఆర్థిక స్థితిని సరిగ్గా పర్యవేక్షించడంలో సాయపడుతుంది.
* ఖర్చు / చెల్లింపులను ట్రాక్ చేయండి : వినియోగదారులు వారి ఖర్చులను ట్రాక్ చేయవచ్చు. ఖర్చుల గురించి కేటగిరీ వారీగా సమాచారాన్ని పొందవచ్చు. తద్వారా వారి ఖర్చులను మొత్తం ఆర్థిక పరిస్థితిని నిర్వహించవచ్చు.
* పూర్తి యూజర్ కంట్రోల్ : వినియోగదారులు రియల్ టైమ్ ప్రాతిపదికన అకౌంట్లను లింక్ చేయవచ్చు. లేదంటే డి-లింక్ చేయవచ్చు. ఈ సదుపాయం కస్టమర్లకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది.
* వివరణాత్మక ప్రకటన(లు): ఈ సదుపాయంతో, వినియోగదారులు అన్ని లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ల సింగిల్ అకౌంట్ ప్రకటనలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
‘iFinance’ సదుపాయాన్ని ఇలా పొందవచ్చు :
* ICICI బ్యాంక్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ iMobilePay, రిటైల్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, కార్పొరేట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్, InstaBIZ ద్వారా లాగిన్ అవ్వండి.
* ‘iFinance’ బటన్‌పై క్లిక్ చేసి, మీ అకౌంట్ వివరాలను వెరిఫై చేసుకోండి.
* వెరిఫై పూర్తయిన తర్వాత వినియోగదారులు ICICI బ్యాంక్, ఇతర బ్యాంకుల అన్ని అకౌంట్లను ఒకేచోట వీక్షించవచ్చు.
* అకౌంట్లను లింక్ చేయడానికి, లింక్ చేయడానికి సమ్మతిని అందించడానికి యూజర్ బ్యాంక్‌ని ఎంచుకోవచ్చు.
* ఆమోదించిన అకౌంట్లు యూజర్లకు డ్యాష్ బోర్డుపై డిస్‌ప్లే అవుతాయి.
ఇతర బ్యాంకుల కస్టమర్‌లు ఇలా యాక్సస్ పొందవచ్చు :
* యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి
* మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోండి.
* ‘iFinance’పై క్లిక్ చేసి మీ అకౌంట్ వివరాలను వెరిఫై చేసుకోండి.
* వెరిఫై పూర్తయిన తర్వాత వినియోగదారులు ICICI బ్యాంక్, ఇతర బ్యాంకుల అన్ని అకౌంట్లను ఒకేచోట వీక్షించవచ్చు.
* అకౌంట్లను లింక్ చేయడానికి, లింక్ చేయడానికి సమ్మతిని అందించడానికి యూజర్ బ్యాంక్‌ని ఎంచుకోవచ్చు.
* ఆమోదించిన అకౌంట్లు యూజర్లకు డ్యాష్ బోర్డుపై డిస్‌ప్లే అవుతాయి.