చైనా ఉత్పత్తులను భారత్ పూర్తిగా బహిష్కరించలేకపోవచ్చు! ఎందుకో తెలుసా?

  • Published By: srihari ,Published On : June 17, 2020 / 03:23 PM IST
చైనా ఉత్పత్తులను భారత్ పూర్తిగా బహిష్కరించలేకపోవచ్చు! ఎందుకో తెలుసా?

Updated On : June 17, 2020 / 3:23 PM IST

ప్రపంచంలో ఎక్కడా చూసినా చైనా ఉత్పత్తుల ప్రభావం అధికంగా కనిపిస్తుంటుంది. తమ దేశంలోకి ఇతర ఉత్పత్తులను రానివ్వని డ్రాగన్ దేశం మాత్రం తమ ఉత్పత్తులను మాత్రం అన్నిదేశాలకు విస్తరిస్తోంది. అలాగే తమ దేశీయ వాణిజ్యాన్ని అభివృద్ధి చేసుకుంటోంది. భారతీయ మార్కెట్లో ఎక్కడా చూసినా చైనా ప్రొడక్టుల ఆధిపత్యం ఎక్కువగా నిపిస్తుంటుంది. ఇప్పుడు వాడే వస్తువుల్లో ఎక్కువగా చైనా వస్తువులే ఎక్కువగా వాడుకలో కనిపిస్తున్నాయి. ప్రస్తుత చైనా, భారత్ మధ్య కొనసాగుతున్న ఉద్రికత్తల నేపథ్యంలో చైనా ఉత్పత్తులను దేశం నుంచి బహిష్కరించాలంటూ డిమాండ్ వినిపిస్తోంది. 

ఇంతకీ చైనా ఉత్పత్తులను భారత్ బహిష్కరించగలదా? అంటే కచ్చితంగా అవునని చెప్పడం కష్టమనే చెప్పాలి. భారతదేశం, చైనా మధ్య ఆర్థిక రహదారులు హిమాలయాల గుండా వెళ్లే రహదారుల మాదిరిగా కనిపిస్తున్నాయి. దశాబ్దాలలో అణు శక్తుల మధ్య జరిగిన ఘోరమైన ఘర్షణ కారణంగానే చైనా వాణిజ్య సంబంధాలను మరింత పెంచుతోంది.

చైనాతో వాణిజ్య సంబంధాలకు మద్దతు పెరిగిపోవడం కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు. 
చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకునే ఉత్పుత్తులను బట్టి పరిశీలిస్తే.. చైనా ఉత్పత్తులను బహిష్కరించడం ఎంతవరకు సాధ్యపడుతుందనే దానిపై సందిగ్థత నెలకొంది. ఇంతకీ చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకునే ఉత్పత్తులేంటో ఓసారి పరిశీలిద్దాం… 

విద్యుత్ యంత్రాలు (Electrical machinery) : 

2019లో భారత్‌‌కు చైనా నుంచి విద్యుత్ యంత్రాల దిగుమతులు 34 శాతంగా ఉంది. భారతదేశంలో రాడార్లు, టీవీ, కెమెరాల కోసం ప్రసార ఉపకరణం వంటి వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. ఎలక్ట్రికల్ ట్రాన్స్ ఫార్మర్లు, మైక్రోఫోన్లు, హెడ్ ఫోన్లు, లౌడ్ స్పీకర్లు కూడా ఈ జాబితాలో భారీగా ఉన్నాయనే చెప్పాలి. 
electrical

న్యూక్లియర్ రియాక్టర్ :

ఐక్యరాజ్యసమితి COMTRADE డేటాబేస్ ప్రకారం.. 2019లో భారతదేశం అంతర్జాతీయ వాణిజ్యంపై 13.87 బిలియన్ డాలర్ల విలువైన అణు రియాక్టర్లు, బాయిలర్లను దిగుమతి
చేసుకుంది.
ships

ఎరువులు : 

2019లో చైనా నుంచి భారత్ ఎరువుల దిగుమతులు 2శాతంగా ఉంది. దేశంలో పంట దిగుబడిని పెంచడానికి ఎరువులలో కీలకమైన డయామోనియం ఫాస్ఫేట్‌ను పొరుగుదేశమైన చైనా నుంచే దిగుమతి చేస్తుంది. భారతీయ రైతులు ఇష్టపడే యూరియా అనే మరో రకమైన మొక్కల పోషకాన్ని కూడా చైనా సరఫరా చేస్తోంది. 
urea

వైద్య పరికరాలు :

2019లో చైనా నుండి వైద్య పరికరాల దిగుమతులు 2శాతం ఉంది. భారతదేశం వ్యక్తిగత రక్షణ పరికరాలు, వెంటిలేటర్లు, N95 మాస్క్‌లు, ఇతర వైద్య వస్తు సామగ్రి కోసం చైనాపై ఆధారపడుతోంది. ప్రస్తుత మహమ్మారితో ఈ అంశాలు మరింత కీలకంగా మారాయి. అయితే, ఆరోగ్య సంక్షోభ సమయంలో ఈ వస్తువులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి భారతదేశం తన సొంత PPE కిట్లు, N95 మాస్క్‌లను భారీగా ఉత్పత్తి చేయడం ప్రారంభించింది.
medical

ఆటో విడి భాగాలు :

2019లో చైనా నుంచి ఆటో విడి భాగాలను భారత్ 2 శాతంగా దిగుమతి చేసుకుంది. దేశంలో కార్ల తయారీకి చాలా భాగాలు చైనా నుంచే వస్తున్నాయి. డ్రైవ్ ట్రాన్స్మిషన్, స్టీరింగ్, ఎలక్ట్రికల్స్, ఇంటీరియర్స్, బ్రేక్ సిస్టమ్స్, ఇంజిన్ కాంపోనెంట్స్ వంటి వస్తువులను చైనా కంపెనీలు భారతీయ కార్ల తయారీదారులకు సరఫరా చేస్తున్నాయి. 
auto