లాక్ డౌన్ దెబ్బ.. ఉద్యోగాలు ఊడినట్లేనా

అవును లాక్ డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థ గందరగోళంలో పడిపోయింది. ఎన్నో పరిశ్రమలు, సంస్థలు, ఇతర వాణిజ్య సంస్థలు క్లోజ్ కావడంతో ఉద్యోగుల పాలిట శాపంగా మారిపోయింది. తాము కన్న కలలు నెరవేరవా అనే సందిగ్ధంలో పడిపోయారు. యావత్ ప్రపంచాన్ని దెబ్బతీస్తున్న కరోనా రాకాసి ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే..కొలువుల కోతలే దిక్కని భావిస్తున్నాయి పలు సంస్థలు.
కరోనా మహమ్మారీ భారతదేశంలో విస్తృతంగా వ్యాపిస్తోంది. పలు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి కరోనా వైరస్ సోకుతుండడంతో ఈ భూతం నుంచి బయటపడేందుకు లాక్ డౌన్ ఒక్కటే మార్గమని కేంద్రం భావించింది. దీంతో 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. కానీ కేసుల సంఖ్య అధికమౌతున్న సందర్భంలో ఈ ఆంక్షలు మరిన్ని రోజులు పొడిగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నష్టాల బారిన పడిన పలు సంస్థలు దిక్కుతోచనిస్థితి పరిస్థితి ఏర్పడిపోయింది.(ఏపీలో కరోనా అప్‌డేట్: 266కి పెరిగిన కరోనా కేసులు)
దీంతో వ్యయ నియంత్రణ దృష్టి పెడుతున్నాయి. వ్యాపార పారిశ్రామిక సంఘం సీఐఐ నిర్వహించిన సీఈవోల సర్వేలో ఇదే అంశం తేలింది. లాక్ డౌన్ తర్వాత..కొతలు పక్కగా అమలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. గత సంవత్సరం చైనా నుంచి వచ్చిన దిక్కుమాలిన వైరస్…ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనా కష్టాలు మెల్లిగా తొలగినా..ఇతర దేశాలు మాత్రం కష్టాల సుడిగుండంలో చిక్కుకపోయాయి.
జనవరి – మార్చి నెల త్రైమాసికంలో దేశీయ ఉత్పాదక రంగాన్ని పెద్ద దెబ్బే కొట్టిందని చెప్పవచ్చు. మునపటి ఉన్న పరిస్థితి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని పలు సంస్థలు భావిస్తున్నాయి.
* 47 శాతం సీఈవో లు..ఉద్యోగాలు కోల్పోయే వారు 15 శాతం దిగువనే ఉండొచ్చంటున్నారు.
* 32 శాతం సీఈవోలు మాత్రం..15-30 శాతంగా ఉండొచ్చంటున్నారు.
* 52 సంస్థలు లాక్ డౌన్ తర్వాత..ఉద్యోగాల తీసివేతలు ఉంటాయని సీఐఐ చెబుతోంది.
* నిరుద్యోగం పెరిగితే…డిమాండ్ తక్కువ కావడం..ఈ ప్రభావం ఉత్పత్తి పడడం..ఫలితంగా ఆర్థిక వ్వవస్థ కుదేలు అవుతుందని భావిస్తున్నారు.