Bajaj Pulsar N160 : కుర్రాళ్ల కోసం కాదు.. ఇది ‘ఫ్యామిలీ పల్సర్’.. ఫీచర్లు మాత్రం కేక.. మీ బడ్జెట్ ధరలోనే..!
Bajaj Pulsar N160 : బజాజ్ ఆటో పల్సర్ N160 కొత్త వేరియంట్ వచ్చేసింది. అద్భుతమైన గోల్డ్ USD ఫ్రంట్ ఫోర్కులు, సింగిల్-పీస్ సీటు ఉన్నాయి. ఈ కొత్త అప్‌డేట్ N సిరీస్ స్పోర్టి ఫీచర్లతో పాటు ఫ్యామిలీ కస్టమర్లకు అద్భుతంగా ఉంటుంది.
Bajaj Pulsar N160
Bajaj Pulsar N160 : కొత్త బైక్ కొనేందుకు చూస్తున్నారా? బజాజ్ ఆటో పాపులర్ మోడల్ పల్సర్ N160 బైక్‌ను కొత్త వేరియంట్‌తో లాంచ్ చేసింది. గోల్డ్ USD ఫ్రంట్ ఫోర్క్‌లను సింగిల్-పీస్ సీటుతో అందిస్తుంది. బజాజ్ 160cc స్ట్రీట్‌ఫైటర్‌కు విజువల్ డ్రామా, రోజువారీ సౌకర్యాన్ని అందిస్తుంది.
డిసెంబర్ 5న పూణేలో లాంచ్ అయిన ఈ కొత్త పల్సర్ N160 బైక్ (Bajaj Pulsar N160) ధర దాదాపు రూ. 1.24 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా బజాజ్ అన్ని డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది. బ్రాండ్ ప్రకారం.. ఈ N సిరీస్ బైకులో స్పోర్టి ఆకర్షణతో పాటు ఫ్యామిలీ కస్టమర్లను కూడా ఆకట్టుకునేలా ఫీచర్లు ఉన్నాయి. తద్వారా ఈ బైకుపై రయ్ రయ్ అంటూ ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.
డైనమిక్ గోల్డ్ USD ఫోర్క్స్ :
ఈ వేరియంట్‌లో అతిపెద్ద మార్పు గోల్డ్ కలర్ అప్‌సైడ్-డౌన్ (USD) ఫోర్క్‌లు కలిగి ఉండటమే. ప్రీమియంగా కనిపించేలా USD ఫోర్క్‌లు దృఢత్వం, స్టీరింగ్ కచ్చితత్వాన్ని అందిస్తాయి. ముఖ్యంగా హార్డ్ బ్రేకింగ్ వంటి ఆప్షన్లు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి. పల్సర్ N160 బైక్‌లో పట్టణ, హైవే స్పీడ్ రైడర్లకు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఫ్రంట్ ఎండ్‌కు కొత్త సెటప్ బైక్ కమాండింగ్ రోడ్ ప్రెజెన్స్ పెంచుతుందని బజాజ్ చెబుతోంది.
లాంగ్ సింగిల్-పీస్ సీటు :
బజాజ్ పల్సర్ N160 ఫస్ట్ స్ప్లిట్-సీట్ లేఅవుట్‌తో వచ్చింది. మొదట్లో స్పోర్టీ రైడర్‌లను ఆకట్టుకుంది. కానీ, ఫ్యామిలీ కస్టమర్లను ఆకట్టుకోలేకపోయింది. బజాజ్ సొంత రీసెర్చ్ ప్రకారం.. చాలా మంది N160 కస్టమర్లు పిలియన్‌లతో బైక్‌ను వాడేందుకు సింగిల్ లాంగ్ సీటును ఇష్టపడుతున్నారని కనుగొన్నారు. ఈ కొత్త వేరియంట్ సింగిల్-పీస్ సీటు కలిగి ఉంది. లాంగ్-రైడ్ సౌకర్యవంతంగా ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి రోజువారీ ప్రయాణానికి బైక్‌ను ఉపయోగించే రైడర్‌లకు అద్భుతంగా ఉంటుంది.
కలర్ ఆప్షన్లు, ధర ఎంతంటే? :
కొత్త అప్‌డేట్ పల్సర్ N160 వేరియంట్ పెర్ల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్, పోలార్ స్కై బ్లూ బ్లాక్ అనే మొత్తం 4 కలర్ ఆప్షన్లలో వస్తుంది. ధర విషయానికి వస్తే.. రూ. 1.24 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంటుంది. 160cc స్పోర్టీ-కమ్యూటర్ ప్రీమియం ఆప్షన్ ఉంది. ఈ వేరియంట్ బజాజ్ ఆటో డీలర్‌షిప్‌లలో దేశవ్యాప్తంగా అమ్మకానికి అందుబాటులో ఉంది.
