Real LRS Clearence : ఊపందుకోనున్న నిర్మాణరంగం.. ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్‌పై ప్రభుత్వం దృష్టి!
Real LRS Clearence : రెగ్యులరైజ్ చేసుకోకుంటే అలాంటి ప్లాట్లు క్రయవిక్రయాలు చేసేటప్పుడు రిజిస్ట్రేషన్లు చేయకుండా ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎల్‌ఆర్‌ఎస్ పథకానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

Real LRS Clearence : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లే అవుట్ క్రమబద్ధీకరణ పథకంలో 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీ పరిధిలోని అక్రమ లే-అవుట్లలోని ప్లాట్లను క్రమబద్దీకరించేందుకు 2020లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతులు లేకుండా లే-అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారందరూ ఈ స్కీమ్‌కు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది.
Read Also : Dream Home: అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులపై భారీ ఆశలు.. ఆ రేంజ్‌లో ఇళ్లు రావాలంటోన్న నిపుణులు
అయితే మాస్టర్ ప్లాన్, జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్లలో భూ కేటాయింపులకు అనుగుణంగా మాత్రమే రెగ్యులరైజ్ చేయాలని డిసైడ్ చేసింది ప్రభుత్వం. దీంతో అనుమతులు లేని లే-అవుట్లలో స్థలాలు కొనుగోలు చేసిన వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. రెగ్యులరైజ్ చేసుకోకుంటే అలాంటి ప్లాట్లు క్రయవిక్రయాలు చేసేటప్పుడు రిజిస్ట్రేషన్లు చేయకుండా ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎల్‌ఆర్‌ఎస్ పథకానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
25.44 లక్షల దరఖాస్తులు పెండింగ్ :
అక్రమ లే-అవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లలో భవిష్యత్తులో నిర్మాణం చేయ్యడానికి, వాటిని అమ్మడానికి అవకాశం లేదు. దీంతో వాటిని రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 25లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా గ్రామ పంచాయతీల పరిధిలో 11లక్షల వరకు అప్లికేషన్స్ వచ్చాయి. అలాగే కొత్తగా వచ్చిన మున్సిపాలిటీల్లో 10లక్షల దరఖాస్తులు రాగా.. జీహెచ్ఎంసీతోపాటు ఇతర కార్పొరేషన్లలో మొత్తం 4 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి.
పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు :
ఇక ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు జీవో ప్రకారం 2020 ఆగస్ట్ 26నాటికి మార్కెట్ వాల్యూ ప్రకారం చదరపు గజానికి ఫీజు నిర్ణయించగా.. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో జీవో 135 ప్రకారం తాము కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న నాటికి ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఎక్కువ మంది ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ క్లియర్ చేయాలని నిర్ణయించడంతో రాబోయే కాలంలో భారీగా రిజిస్ట్రేషన్స్ జరగనున్నాయి. ప్లాట్లు చేతులు మారడంతో పాటు నిర్మాణ యాక్టివిటీ కూడా ఊపందుకోనుంది. దీంతో ప్రభుత్వానికి పన్నుల ద్వారా వివిధ రూపాల్లో ఆదాయం లభించనుందని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లోని కార్పొరేషన్ల పరిధిలో దాదాపు 4 లక్షల దరఖాస్తులు క్లియర్ అయితే ఇందులో రెండున్నర లక్షల దరఖాస్తుల వరకు ఎక్కువ విస్తీర్ణం కలిగిన ప్లాట్లు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ అనుమతులు వస్తే ఆ స్థలాల్లో భారీ సంఖ్యలో కమర్షియల్, రెసిడెన్షియల్ నిర్మాణాలు జరిగే అవకాశాలున్నాయి.
Read Also : Real 2050 Master Plan : 2050 పేరుతో మాస్టర్ ప్లాన్‌పై టీ-సర్కార్ కసరత్తు!