Jio, Airtel, BSNL, Tata Sky టాప్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలు సహా భారతదేశంలో చాలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయాలని సూచిస్తున్నాయి. కొవిడ్-19 వ్యాప్త

Jio, Airtel, BSNL, Tata Sky టాప్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు ఇవే!

Updated On : December 6, 2021 / 11:12 AM IST

Jio, Airtel, BSNL, Tata Sky:ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాలు సహా భారతదేశంలో చాలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయాలని సూచిస్తున్నాయి. కొవిడ్-19 వ్యాప్తితో ముందుజాగ్రత్త చర్యగా అందరిని ఇంట్లోనే ఉండి పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇంట్లోనుంచి పనిచేయాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ సదుపాయం ఉండాల్సిందే.

అప్పుడే ఆఫీసుల్లోగా ఇంట్లోనే సజావుగా పనిపూర్తి చేయడానికి వీలుంటుంది. ఇంటర్నెట్ సౌకర్యం కూడా వేగవంతంగా ఉండాలి. బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లో ఏది హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుందో అలాంటి బెస్ట్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసును ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీ ముందు టాప్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ టెల్, టాటా స్కై, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో ఫైబర్ కూడా టాప్ ప్లాన్లు అందిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు :
ఎయిర్ టెల్ మల్టీపుల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. బేస్ ప్లాన్ ప్రారంభ ధర రూ.799 నుంచి రూ.3,999 వరకు ఆఫర్ చేస్తోంది. ఎయిర్ టెల్ 1GBPS వరకు డేటా స్పీడ్ అందిస్తోంది. ప్రీ వాయిస్ కాల్స్ అందిస్తోంది. కొన్ని బ్రాండ్ బ్యాండ్ ప్లాన్లు కూడా ఉన్నాయి. అన్ లిమిటెడ్ డేటా ఆఫర్లలో అదనంగా రూ.299 ప్లాన్ అందిస్తోంది. దీనిపై 100Mbps వరకు స్పీడ్ పొందవచ్చు.

ధర : రూ. 799
స్పీడ్ :  100mbps వరకు
డేటా : 150GB
వ్యాలిడిటీ : 1 నెల

ధర : రూ. 999
స్పీడ్ :  200 mbps వరకు
డేటా : 300 GB
వ్యాలిడిటీ : 1 నెల

ధర : రూ. 1,499 
స్పీడ్ :  300 mbps వరకు
డేటా : 500 GB
వ్యాలిడిటీ : 1 నెల

టాటా స్కై బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు :
టాటా స్కై.. బ్రాడ్ బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లలో ఒకటి. ఈ సర్వీసు ఎలాంటి డేటా క్యాప్ లేకుండానే అన్ లిమిడెట్ ప్లాన్లను అందిస్తోంది. అన్ లిమిటెడ్ ప్లాన్ ప్రారంభ ధర రూ.900 నుంచి అందిస్తోంది. అన్ లిమిటెడ్ డేటాతో పాటు నెలలో 25Mbps స్పీడ్ ఆఫర్ చేస్తోంది.

ధర : రూ. 900 
స్పీడ్ :  25 mbps వరకు
డేటా : Unlimited
వ్యాలిడిటీ : 1 నెల

ధర : రూ. 1,000 
స్పీడ్ :  50 mbps వరకు
డేటా : Unlimited
వ్యాలిడిటీ : 1 నెల

ధర : రూ. 1,100 
స్పీడ్ :  100 mbps వరకు
డేటా : Unlimited
వ్యాలిడిటీ : 1 నెల

BSNL బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లు :
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ 24Mbps వరకు ప్లాన్లను అందిస్తోంది. బేస్ ప్లాన్ ప్రారంభ ధర రూ.349 నుంచి ఆఫర్ చేస్తోంది. 8Mbps స్పీడ్ తో రోజుకు 2GB డేటా క్యాప్ నెల వ్యాలిడిటీతో అందిస్తోంది. 24Mbps ప్లాన్ ధర రూ.2,349 తో రీఛార్జ్ చేస్తే రోజుకు 35GB డేటా లిమిట్ అందిస్తోంది. నెలపాటు వ్యాలిడిటీ పొందవచ్చు. ఈ ప్లాన్లు అన్నీ లాంగ్ టర్మ్ ప్లాన్లను కూడా కలిగి ఉన్నాయి. ఇంటి నుంచి పనిచేసేవారు ఈ ప్లాన్లను పొందవచ్చు.

ధర : రూ. 399 
స్పీడ్ :  8 mbps వరకు
డేటా : రోజుకు 2GB
వ్యాలిడిటీ : 1 నెల

ధర : రూ. 499 
స్పీడ్ :  8 mbps వరకు
డేటా : రోజుకు 3GB
వ్యాలిడిటీ : 1 నెల

ధర : రూ. 999 
స్పీడ్ :  10 mbps వరకు
డేటా : రోజుకు 15GB
వ్యాలిడిటీ : 1 నెల

ధర : రూ. 1,599 
స్పీడ్ :  10 mbps వరకు
డేటా : రోజుకు 25GB
వ్యాలిడిటీ : 1 నెల

రిలయన్స్ జియో ఫైబర్ ప్లాన్లు :
జియో బేస్ ప్లాన్లలో ప్రారంభ ధర రూ.699 నుంచి రూ.8,499 వరకు అఫర్ చేస్తోంది. డేటా స్పీడ్ రేంజ్ కూడా 100Mbps నుంచి 1Gbps వరకు అందిస్తోంది. ఈ ప్లాన్లలో వాయిస్ కాలింగ్ ఆప్షన్ కూడా ఉంది. OTT సబ్ స్ర్కిప్షన్లలో వీడియో కాలింగ్, డివైజ్ సెక్యూరిటీ సపోర్ట్ కూడా అందిస్తోంది.

ధర : రూ. 699 
స్పీడ్ :  100 mbps వరకు
డేటా : 100GB+50GB
వ్యాలిడిటీ : 1 నెల

ధర : రూ. 849 
స్పీడ్ :  10 mbps వరకు
డేటా : 200GB + 200GB
వ్యాలిడిటీ : 1 నెల

ధర : రూ. 1,299 
స్పీడ్ :  250 mbps వరకు
డేటా : 500GB+250GB
వ్యాలిడిటీ : 1 నెల

ధర : రూ. 2,499 
స్పీడ్ :  500 mbps వరకు
డేటా : 1250GB + 250GB
వ్యాలిడిటీ : 1 నెల

ధర : రూ. 3,999 
స్పీడ్ :  1Gbps వరకు
డేటా : 2500GB
వ్యాలిడిటీ : 1 నెల