సెప్టెంబర్ 6న లాంచ్ : ఇండియాలో Vivo Z1x వచ్చేస్తోంది
చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ అధికారిక లాంచ్ కాబోతోంది. సెప్టెంబర్ 6న ఇండియన్ మార్కెట్లో Vivo Z1x సిరీస్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ కానుంది.

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ అధికారిక లాంచ్ కాబోతోంది. సెప్టెంబర్ 6న ఇండియన్ మార్కెట్లో Vivo Z1x సిరీస్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ కానుంది.
చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ అధికారిక లాంచ్ కాబోతోంది. సెప్టెంబర్ 6న ఇండియన్ మార్కెట్లో Vivo Z1x సిరీస్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ కానుంది. ఈ కామర్స్ దిగ్గజ వెబ్ సైట్ Flipkartలో సేల్ అందుబాటులో ఉండనుంది. అఫిషీయల్ లాంచింగ్ ముందే వివో z1x స్మార్ట్ ఫోన్ కీలక స్పెషిఫికేషన్లు, ఫీచర్లు ఎలా ఉన్నాయో కంపెనీ రివీల్ చేసింది. Vivo Z1xలో స్పోర్ట్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 712 ప్రాసెసర్ ఉంది. మల్టిటాస్కింగ్‌తో పాటు అల్ట్రా ఫాస్ట్ గేమింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇందులో 10nm chipset పవర్ సర్క్యూట్ ఉంది. స్మార్ట్ ఫోన్ Realme XT, Vivo Z5 మాదిరిగా శక్తివంతంగా ఉంటుంది.
స్నాప్ డ్రాగన్ 712 ప్రాసెసర్‌తో కలిసి అడ్రినో 616 GPU గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది. 4,500mAh బ్యాటరీతో 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది. సూపర్ AMOLED డిస్‌ప్లే, ఇన్ స్ర్కిన్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఉంది. ఈ సెన్సార్ ద్వారా ఫోన్ 0.48 సెకన్లలోనే అన్‌లాక్ చేసుకోవచ్చు. రిపోర్టుల ప్రకారం.. వివో z1x 6.38 అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లేతో వస్తోంది. 64GB, 128GB స్టోరేజీలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ స్పోర్ట్ 48MP రియర్ సెన్సార్, 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇదివరకే ఇండియాలో రిలీజ్ అయిన వివో z1 ప్రో ప్రారంభ ధర రూ.14వేల 990గా ఉంది. వివో z1x ధర రూ.16వేల 990 వరకు ఉంటుందని అంచనా.
స్పెషిఫికేషన్లు – ఫీచర్లు ఇవే :
* 6.38 అంగుళాల Full HD డిస్‌ప్లే
* 64GB + 128GB వేరియంట్లు
* 48MP రియర్ సెన్సార్
* 32MP సెల్ఫీ కెమెరా
* 4,500mAh బ్యాటరీ
* 22.5W ఫాస్ట్ ఛార్జింగ్
* సూపర్ AMOLED డిస్‌ప్లే
* ఇన్- స్ర్కీన్ ఫింగర్ ఫ్రింట్ సెన్సార్
* స్పోర్ట్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 712 ప్రాసెసర్
* అల్ట్రా ఫాస్ట్ గేమింగ్, మల్టిటాస్కింగ్
* 10nm చిప్ సెట్, అడ్రినో 616 GPU గ్రాఫిక్స్