Yamaha 2023 Updates : యమహా 2023 మోడల్ ఇయర్ అప్‌డేట్స్.. ఈ నాలుగు బైకులకు సరికొత్త ఫీచర్లు.. ధర కూడా ఎక్కువే..!

Yamaha launches 2023 updates for FZ-S, FZ-X, MT15 and R15M
Yamaha 2023 Updates : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ యమహా (Yamaha) నుంచి 2023 కొత్త అప్‌డేట్స్ రిలీజ్ చేసింది. ప్రత్యేకించి యమహా FZS-FI V4, FZ-X, MT-15 V2.0, R15 V4 మోటార్ బైకుల కోసం 2023 మోడల్ ఇయర్ అప్‌డేట్‌ను ప్రారంభించింది. ఈ మోటార్‌సైకిళ్లు ఇప్పుడు కొత్త OBD-2 నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి.

Yamaha launches 2023 updates for FZ-S, FZ-X, MT15 and R15M
అదనంగా, నాలుగు మోటార్‌సైకిళ్లకు ట్రాక్షన్ కంట్రోల్‌తో సహా కొత్త ఫీచర్లు అప్‌డేట్ అయ్యాయి. 2023 యమహా FZS-FI V4 రీడిజైన్ చేసిన LED DRL, హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌ను అందించనుంది. అయితే, కంపెనీ అందించే ఈ ఆఫర్‌లో బూడిద, ఎరుపు నలుపు మూడు రంగులు ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, కొత్త LCD డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, LED టర్న్ ఇండికేటర్లతో రానున్నాయి.

Yamaha launches 2023 updates for FZ-S, FZ-X, MT15 and R15M
Yamaha FZS-FI V4 ధర రూ. 1.27 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా.. FZ-X కూడా ట్రాక్షన్ కంట్రోల్ పొందుతుంది. ఇప్పుడు గోల్డెన్ అల్లాయ్ వీల్స్‌తో ప్రామాణికంగా అందుబాటులో ఉంది. దీని ధర రూ. 1.37 లక్షలు (ఎక్స్-షోరూమ్). Yamaha MT-15 V2.0 ఇప్పుడు డ్యూయల్-ఛానల్ ABS, LED టర్న్ ఇండికేషన్స్, ట్రాక్షన్ కంట్రోల్‌తో అందుబాటులో ఉంది.

Yamaha 2023 Updates : Yamaha launches 2023 updates for FZ-S, FZ-X, MT15 and R15M
ఈ మోటార్‌సైకిల్ ధర రూ. 1.68 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. యమహా R15M అప్‌డేట్‌లను కలర్ TFT డిస్‌ప్లే రూపంలో అందించింది. ఈ డిస్‌ప్లే ల్యాప్ టైమర్‌ని కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో వస్తుంది. డిస్‌ప్లేలో స్పీడో, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఇంధన స్థాయి గేజ్, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉన్నాయి. Yamaha R15M ధర రూ. 1.94 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇందులో అన్ని మోటార్‌సైకిళ్లు యాంత్రికంగా మారలేదని చెప్పవచ్చు. కొత్త ఫీచర్‌లతో పాత వాటి కన్నా కొన్ని వేల రూపాయలు ఎక్కువగా ఉండవచ్చు.