అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుకున్న కస్టమ్స్ అధికారులు

  • Published By: murthy ,Published On : November 5, 2020 / 05:06 PM IST
అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుకున్న కస్టమ్స్ అధికారులు

Updated On : November 5, 2020 / 5:21 PM IST

Gold Seized from dubai passanger : తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడింకోకడు ఉంటాడనేది సామెత. దేశంలో బంగారం స్మగ్లింగు అరికట్టటానికి పోలీసులు, అధికారులు ఎంత ప్రయత్నం చేస్తున్నా ఏదో ఒక రకంగా బంగారాన్ని దేశంలోకి చేరవేసేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పోలీసులు నిఘా పెంచుతున్నకొద్దీ నేరగాళ్ల ఆలోచనలు కూడా మారుతున్నాయి.

తాజాగా హైదరాబాద్ శంషాబాదో ఎయిర్ పోర్టులో బంగారం తరలిస్తున్నవ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి నగరానికి వచ్చిన ఒక వ్యక్తి అధికారుల కళ్లు గప్పి బంగారాన్ని తరలించాలని ప్రయత్నం చేశాడు. అందుకు గానూ ఎవరూ గుర్తుపట్టలేని విధంగా తన ప్యాంటు లోపల ప్రత్యేక జేబు ఏర్పాటు చేసుకున్నాడు.