తల్లితో సహజీవనం, కూతురిపై అత్యాచారం

ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. తల్లితో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి , ఆమెకు తెలియకుండా ఆమె కూతురుపై కూడా అత్యాచారం చేశాడు. తల్లికి చెపితే … ఇద్దరికీ పెళ్లి చేసేస్తా గొడవ చెయ్యకని చెప్పింది. దీంతో బాధితురాలు దిశ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయటంతో దారుణం వెలుగు చూసింది.
బెస్తవారి పేటకు చెందిన మహిళ స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో పని చేస్తోంది. ఆమెకు భర్తకు గొడవలు రావటంతో ఇద్దరు కూతుళ్ళను పెట్టుకుని ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఈమెకు బలరాం కాలనీకి చెందిన సుభానితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త సహజీవనంగా మారింది.
తల్లి ప్రవర్తన నచ్చని చిన్న కూతురు అమ్ముమ్మ ఇంటికి చేరుకుని అక్కడే చదువుకుంటోంది. పెద్ద కూతురు తల్లివద్దే ఉంటూ 9వ తరగతి చదువుతోంది. ఈ క్రమంలో సుభాని కన్ను ఇంట్లో ఎదుగుతున్న మహిళ కుమార్తెపై పడింది. మహిళ ఇంట్లో లేని సమయంలో ఆమె మైనర్ కూతురును బెదిరించి ఆమెపై సుభాని లైంగిక దాడి చేశాడు.
ఇలా రెండు సార్లు చేయటంతో భయపడిన బాలిక తల్లికి చెప్పింది. ఈవిషయమై గోల చేయవద్దని ఇద్దరికీ పెళ్లి చేస్తానంటూ నచ్చచెప్పేందుకు ప్రయత్నించింది. కూతురు అందుకు ఒప్పుకోలేదు.తల్లితో సహజీవనం చేసే వ్యక్తితోపెళ్లి ఏంటని నిలదీసింది. దీంతో సుభాని చంపుతానంటూ బెదిరించాడు.
దీంతో భయపడిన బాలిక అమ్ముమ్మ ఇంటికి చేరుకుంది.అక్కడి బంధువులకు విష.యం చెప్పి భోరున విలపించింది. వారి సహాయంతో ఒంగోలు దిశ పోలీసు స్టేషన్ కు వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. పోలీసులు సుభానిపై పోక్సో కేసు, ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
నిందితుడికి సహకరించిన తల్లిపైనా కేసు నమోదు చేశారు. బాలికను పరీక్ష నిమిత్తం ప్రభుత్వం వైద్య శాలకు తరలించారు. ఇలా ఉండగా..బాలిక తల్లి తన కుమార్తె కనిపించటం లేదని టూటౌన్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయటం కొసమెరుపు.