Playing Cards : హైటెక్ పేకాట రాకెట్ గుట్టు రట్టు-14 మంది అరెస్ట్

హైదరాబాద్ కూకట్ పల్లిలో సంపన్నులు నివసించే   గేటెడ్ కమ్యుూనిటీ లోని ఒక అపార్ట్ మెంట్‌లో గుట్టుగా  నిర్వహిస్తున్న హైటెక్ పేకాట రాకెట్ ను పోలీసులు చేధించారు.

Playing Cards : హైటెక్ పేకాట రాకెట్ గుట్టు రట్టు-14 మంది అరెస్ట్

playing cards

Updated On : February 25, 2022 / 12:49 PM IST

Playing Cards : హైదరాబాద్ కూకట్ పల్లిలో సంపన్నులు నివసించే   గేటెడ్ కమ్యుూనిటీ లోని ఒక అపార్ట్ మెంట్‌లో గుట్టుగా  నిర్వహిస్తున్న హైటెక్ పేకాట రాకెట్ ను పోలీసులు చేధించారు.

సంపన్నులు నివసించే  ఒక పేరున్న అపార్ట్ మెంట్ లో నిత్యపు మురళీ అనే వ్యక్తి ప్లాట్ అద్దెకు తీసుకున్నాడు. ఆ ప్లాట్ కు నెలకు లక్షన్నర అద్దె చెల్లిస్తున్నాడు. అక్కడ ఒక ఆఫీసు ప్రారంభించాడు. హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో   పేకాట పై ఆసక్తి ఉండే వారితో ఒక వాట్సప్ గ్రూపు క్రియేట్ చేశాడు.  వారిని వాట్సప్ గ్రూపు ద్వారా    అపార్ట్ మెంట్ కు ఆహ్వానించి అక్కడ వారితో పేకాట నిర్వహించేవాడు.
Also Read : karimnagar Maoists : కరీంనగర్ జిల్లాకు మావోయిస్టు లింకులపై ఆరా తీస్తున్న పోలీసులు

ప్రతిరోజు ఇక్కడ జరిగే పేకాటలో లక్షల రూపాయలు చేతులుమారుతున్నట్లు తెలుస్తోంది. అపార్ట్ మెంట్ లో హై టెక్ పేకాట నడుస్తోందనే విశ్వసనీయ సమాచారం తో పోలీసులు ప్లాట్ పై దాడి చేసి మురళీతో పాటు మరో 13 మందిని అరెస్ట్ చేశారు.