ఓట్ల తొలగింపు, ఫారం-7 దుర్వినియోగం : విచారణకు మరో సిట్ ఏర్పాటు 

  • Published By: veegamteam ,Published On : March 8, 2019 / 05:13 AM IST
ఓట్ల తొలగింపు, ఫారం-7 దుర్వినియోగం : విచారణకు మరో సిట్ ఏర్పాటు 

Updated On : March 8, 2019 / 5:13 AM IST

అమరావతి : ఓట్ల తొలగింపు, ఫారం 7 దుర్వినియోగంపై ఏపీ సర్కార్ దూకుడు పెంచింది. ఈ కేసుల విచారణ కోసం మరోసిట్ ఏర్పాటు చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి కె.సత్యనారాయణ ఆధ్వర్యంలో 8 మందితో సిట్ ఏర్పాటు చేశారు. మార్చి 6 బుధవారం వరకు ఓట్ల తొలగింపుపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 322 కేసులు నమోదు అయ్యాయి. అన్ని కేసుల విచారణను ప్రభుత్వం సిట్ కు అప్పగించింది. సిట్ లో సభ్యులుగా గుంటూరు రేంజ్ ఐజీ ఆర్కే మీనా, విశాఖ, ఏలూరు, కర్నూలు, అనంతపురం రేంజ్ డీఐజీలు పాలరాజు, త్రివిక్రమవర్మ, నాగేంద్రకుమార్ కాంతిరాణాటాటా, గుంతకల్ రైల్వే ఏసీపీ సిద్దార్థ్  కౌశల్, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ డీఎప్పీ ఏ.రాజేంద్ర ఉన్నారు.