ఏపీ మంత్రి బాలినేని ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం, ఒకరి మృతి

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక కానిస్టేబుల్ మృతి చెందాడు. మంగళవారం ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి మంత్రి విజయవాడకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడ వెళుతుండగా పెద్ద అంబర్ పేట వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ఎస్కార్ట్ వాహనం టైర్ బ్లాస్ట్ కావటంతో బొలెరో వాహనం పల్టీలు కొడుతూ కింద పడింది. ఈప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ పాపయ్య మరణించాడు.
మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన కానిస్టేబుళ్ళను హయత్ నగర్ లోని ఒక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Here>>30లక్షల కుటుంబాలకు సీఎం జగన్ శుభవార్త