Bangalore : యూకే టెకీకే టోకరా ఇచ్చిన కిలాడీ .. హనీట్రాప్‌తో రూ. కోటి కొట్టేసిన యువతి
చేతినిండా డబ్బులు. కానీ పెళ్లికాలేదు. పెళ్లి చేసుకోవాలనే క్రమంలో ఓ కిలాడీ లేడీ వలలో పడ్డాడు. కోటి రూపాయలు పైగా పోగొట్టుకున్నాడు.

Fake bride Cheating In Bangalore
Fake bride Cheating In Bangalore : అతనో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. యూకేలో ఉద్యోగం. చేతినిండా డబ్బులు. కానీ పెళ్లికాలేదు. పెళ్లి కోసం ఓ పేరున్న మ్యాట్రీమోనీ సైట్ (Matrimonial site)లో రిజిస్టర్ అయ్యాడు. తాను ఓ పెళ్లికాని అమ్మాయిలో అతనిని నమ్మించిందో యువతి. ట్రైనింగ్ కోసం బెంగళూరు వచ్చిన యువకుడు ఓ కిలాడీ లేడీ వలలో చిక్కాడు. వివస్త్రగా వీడియో కాల్ చేసి యూకే టెకీని బోల్తా కొట్టించింది. కోటి రూపాయలు దోచేసింది.దీంతో తాను మోసపోయానని గ్రహంచిన ఆ టెక్నాలజీ కుర్రాడు లబోదిబోమంటూ పోలీసులకు మొరపెట్టుకున్నాడు.
బెంగళూరు(Bangalore)లోని ఆర్‌కే పురానికి (RK Puram) చెందిన ఓ వ్యక్తి యూకే (UK)లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం (Software job) చేస్తున్నాడు. మంచి జీతం. ఇక పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుదామనుకున్నాడు. ట్రైనింగ్ కోసమని బెంగళూరుకు వచ్చిన సమయంలో మంచి అమ్మాయిని చూసి వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. దీంతో మ్యాట్రీమోనీలో రిజిస్టర్ అయ్యాడు. ఆ సైట్ లోనే ఓ యువతి పరిచయం అయ్యింది. రోజు మాట్లాడుకునేవారు. ఇద్దరి మనసులు కలిసాయి పెళ్లి చేసుకుందామనుకున్నాడు. ఈ క్రమంలో సదరుయువతి ఓ రోజున ఫోన్ లో మాట్లాడుతు తన తండ్రి చనిపోయాడు..తల్లితో కలిసి ఉంటున్నాను అంటూ చెప్పింది. తాను ఎన్నో కష్టాలు పడ్డానని ఏడ్చింది. అతను కరిగిపోయాడు. మనం ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం నీ కష్టం నా కష్టం కాదా పెళ్లి చేసుకున్నాక నిన్ను బాగా చూసుకుంటాను అంటూ ఓదార్చేవాడు. అలా అలకలు. కన్నీళ్లు, రొమాన్సులు ముచ్చట్లు అన్నీ ఫోన్లోనే నడిచేవి.
అలా ఓరోజున తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు అంటూ ఏడ్చింది. ఆస్పత్రికి వెళ్లాలి కాస్త డబ్బు ఇవ్వగలరా..? అంటూ గోముగా అడిగింది. అలా అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటాడు. కొంత డబ్బు ఇచ్చాడు. ఇది అప్పుగానే సుమా..తరువాత ఇచ్చేస్తాననండీ అంటూ గారాలుపోయింది. ఏం ఫరవాలేదు నువ్వేవీ తిరిగి ఇవ్వక్కర్లేదు త్వరలోనే మనం పెళ్లి చేసుకోబోతున్నాంగా అంటూ డబ్బు పంపించాడు.
ఆ తరువాత అమ్మకు మీవల్లే బాగైంది. నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ ఫోన్ లో చెప్పింది. అలా దానికి అతను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అలా వారి ముచ్చట్లు మితిమీరి తన దార్లో పడుతున్నాడనుకున్న ఆమె ఓ రోజు వివస్త్రగా ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మాట్లాడింది. అతనికి నోట మాటరాలేదు. అదంతా వీడియో అంతా అతనికి తెలియకుండా రికార్డ్ చేసింది. తరువాత కూల్ గా ఆ వీడియో అతనికి షేర్ చేసి డబ్బులు ఇవ్వాలని లేదంటే మీ అమ్మానాన్నలకు ఈ వీడియో పంపిస్తానంటూ బెదిరించింది.పాపం అతను భయపడిపోయాడు. అలా బెదిరింపులతో కోటి రూపాయలకుపైనే గుంజింది. అలా బెదిరించటం డబ్బులు ఇవ్వటం దీంట్లోంచి ఎలాగైనా బయటపడాలని ధైర్యం చేసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Tomato Prices : ఇద్దరు పిల్లల్ని తాకట్టు పెట్టి టమటాలు కొనుగోలు చేసిన వ్యక్తి ..
కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె బ్యాంక్ ఖాతాలనుంచి ఆమె డబ్బులు తీసుకోకుండా బ్లాక్ చేయించారు. అప్పటికే ఆమె రూ.30లక్షలు బ్యాంకు నుంచి తీసేసుకుంది. ఇక అలా చేయకుండా రూ. 84 లక్షలు ఆమె డ్రా చేసుకోవటానికి వీల్లేకుండా చేశారు. మరి అతని డబ్బును రికవరీ చేసే పనిలో పడ్డారు పోలీసులు. ఇలా టెక్నాలజీలో ఘనులైనా..ప్రజా ప్రతినిధులైనా హనీ ట్రాపుల్లో చిక్కుకుని పరువుతో పాటు డబ్బు పోగొట్టుకుంటున్నారు చాలామంది. కాబట్టి ప్రతీ ఒక్కరు ఫోన్ కాల్స్ గానీ సోషల్ మీడియాల్లో చాటింగ్ ల విషయంలో గానీ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. సైబర్ క్రైమ్ కు గురై భారీగా నష్టపోయినవారు ఎందరో..