సహోద్యోగిని స్నానం చేస్తుండగా వీడియో తీసి ప్రియుడికి పంపిన నర్సు

  • Published By: murthy ,Published On : December 14, 2020 / 11:00 AM IST
సహోద్యోగిని స్నానం చేస్తుండగా వీడియో తీసి ప్రియుడికి పంపిన నర్సు

Updated On : December 14, 2020 / 11:09 AM IST

Bengaluru Nurse detained : బెంగుళూరు వైట్ ఫీల్డ్ పోలీసులు ఒక ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రి నర్సును, ఆమె ప్రియుడ్ని అదుపులోకి తీసుకున్నారు. సహోద్యోగులు బాత్ రూంలో స్నానం చేస్తుండగా సెల్ ఫోన్ లో వీడియో తీసి అవి తన ప్రియుడికి పంపించిన కారణంగా అమెను పోలీసులు అరెస్టు చేశారు. వైట్ ఫీల్డ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అత్యవసర సేవలు చేసే విభాగంలోని నర్సులకు హాస్టల్ వసతి కల్పించారు. అందులో తమిళనాడులోని గుడియాత్తంకు చెందిన అశ్విని నర్సుగా పని చేస్తోంది.

డిసెంబర్ 8వ తేదీన విధులు ముగించుకున్న ఒక నర్స్ బాత్ రూంలో స్నానం చేస్తుండగా మొబైల్ కనిపించింది. భయపడిన నర్సు దాన్ని పరిశీలించగా వీడియో కెమెరా ఆన్ అయి, ఆమె స్నానం చేస్తుండగా రికార్డింగ్ అయినట్లు గుర్తించింది. ఈ విషయాన్ని ఆమె హాస్టల్ ఇన్ చార్జ్ కు తెలిపింది. ఫోన్ గ్యాలరీ ఫోల్డర్ పరిశీలించిన ఇన్ చార్జి షాక్ కు గురయ్యింది. అందులో తమ హాస్టల్ కు చెందిన పలువురు నర్సులు బాత్రూం వీడియోలు చూసి షాక్ కు గురయ్యింది.

ఆ ఫోన్ లోని సిమ్ కార్డ్ , కాంటాక్ట్ లిస్ట్ అశ్వినికి చెందినదిగా గుర్తించింది. ఇన్ చార్జి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అశ్వినిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అలాంటి వీడియోలు తన ప్రియుడికి పంపించినట్లు ఒప్పుకుంది. అశ్విని ఎవరికీ అనుమానం రాకుండా బాత్ రూంలో ఫోన్ ను దాచి పెట్టింది. ఆమెపై ఐపీసీ సెక్షన్ 354సీ (voyeurism) కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. కాగా….. అశ్విని ప్రియుడు ఆ వీడియోలను ఏం చేశాడు…ఎవరెవరికి పంపించాడు అనే కోణంలో పోలీసుల అతడ్ని విచారిస్తున్నారు.