లారీ డ్రైవర్ ను కొట్టి చంపిన బైక్ రైడర్

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 08:02 AM IST
లారీ డ్రైవర్ ను కొట్టి చంపిన బైక్ రైడర్

Updated On : May 28, 2020 / 3:41 PM IST

మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఓ బైక్ రైడర్.. లారీ డ్రైవర్ ను కొట్టి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్ర గొండియా జిల్లాకు చెందిన రహీమ్ లారీ డ్రైవర్. లారీని డ్రైవ్ చేస్తూ హైదరాబాద్ కు వస్తున్నాడు. మార్గంమధ్యలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాల్ టెక్స్ ప్రాంతంలోని ఫ్లై ఓవర్ పై బైక్ రైడర్.. లారీని ఓవర్ టేక్ చేశాడు. అంత స్పీడ్ గా ఎందుకు వెళ్తున్నావని లారీ డ్రైవర్ .. బైక్ రైడర్ పై అరిచాడు.

దీంతో ఆగ్రహానికి గురైన బైక్ రైడర్ లారీని వెంబడించాడు. 2 కిలో మీటర్ల దూరం వెళ్లి ఛేజ్ చేసి పెట్రోల్ పంప్ దగ్గర లారీకి అడ్డంగా బైక్ ను పెట్టాడు. అనంతరం లారీ డ్రైవర్ ను చితకబాదాడు. తీవ్ర గాయాలు కావడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బైక్ రైడర్ ఎరన్నది తెలియరాలేదు. అతడి వివరాలు తెలుసుకునే కోణంలో విచారణ చేపట్టారు. 
Also Read : ఒడిశాలో హై అలర్ట్ : స్కూళ్లు, కాలేజీలు మూసివేత.. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు