CAF Commander end life : రివాల్వర్ తో కాల్చుకుని సీఏఎఫ్ కమాండర్ బలవన్మరణం

జగదల్ పూర్ జిల్లాలోని కరణ్ పూర్ సీఏఎఫ్ క్యాంపులో విధులు నిర్వహిస్తున్న 19 వ నెంబర్ బెటాలియన్ కు చెందిన కమాండర్... సుబీర్ సింగ్ (43) తనవద్ద ఉన్నసర్వీసు రివాల్వర్ తో పొట్టలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

CAF Commander end life : రివాల్వర్ తో కాల్చుకుని సీఏఎఫ్ కమాండర్ బలవన్మరణం

Commander Ends Life

Updated On : April 14, 2021 / 1:05 PM IST

CAF Commander end life, Chattisgarh : చత్తీస్ గఢ్ రాష్ట్రంలో సీఏఎఫ్ కమాండర్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. జగదల్ పూర్ జిల్లాలోని కరణ్ పూర్ సీఏఎఫ్ క్యాంపులో విధులు నిర్వహిస్తున్న 19 వ నెంబర్ బెటాలియన్ కు చెందిన కమాండర్… సుబీర్ సింగ్ (43) తనవద్ద ఉన్నసర్వీసు రివాల్వర్ తో పొట్టలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

దీన్ని గమనించిన జవానులు వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. స్ధానిక క్యాంపు అధికారుల సమాచారం మేరకు ఉన్నతాధికారులు శాఖపరమైన దర్యాప్తు చేపట్టారు.