Call Money : కర్నూలులో కాల్‌మనీ కలకలం-మహిళపై దాడి

కర్నూలు‌లో కాల్‌మనీ వ్యవహారం కలకలం రేపింది. తీసుకున్న అసలుతోపాటు వడ్డీ కట్టినా ఇంకా మరింత డబ్బు చెల్లించాలని బాధితురాలిని వడ్డీ వ్యాపరస్తులు చితక బాదారు.

Call Money : కర్నూలులో కాల్‌మనీ కలకలం-మహిళపై దాడి

Kurnool Call Money

Updated On : November 16, 2021 / 6:54 PM IST

Call Money :  ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ కాల్ మనీ వ్యవహారం వెలుగు చూసింది.  కర్నూలు‌లో   తీసుకున్న అసలుతోపాటు వడ్డీ కట్టినా ఇంకా మరింత డబ్బు చెల్లించాలని బాధితురాలిని వడ్డీ వ్యాపారస్తులు చితకబాదిన ఘటన చోటు చేసుకుంది.  గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చేరింది.

కేరళకు చెందిన సింధు కర్నూలు లో సెటిల్ అయ్యింది. ఆమె కుటుంబ అవసరాల కోసం కుమార్ రెడ్డి, వసుంధర అనే వారి వద్ద డబ్బు అప్పుగా తీసుకుంది. తీసుకున్న అప్పు అసలు, వడ్డీతో కలిసి చెల్లించినా ఇంకా చెల్లించాలని చెప్పి కుమార్ రెడ్డి దంపతులు సింధును రక్తం వచ్చేలా చితక బాదారు. తీవ్ర గాయాలైన సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Also Read : Tirumala: రేపటి నుంచి తిరుమల నడకదారి మూసివేత..!