కార్డన్ సెర్చ్ : ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో బారాముల్లా జిల్లాలోని సోపూర్ లో భద్రతా దళాలు, స్దానిక పోలీసుల సహకారంతో గురువారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
సోపూర్ లోని మెయిన్ చౌక్ లో గాలింపు జరపుతుండగా ఉగ్రవాదులు పోలీసుల పైకి గ్రనేడ్ విసిరి పరారయ్యారు. దాడి చేసిన వ్యక్తుల కోసం పోలీసులు భద్రతా దళాలు గాలిస్తున్నాయి. ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
Read Also : పోసానికి ఈసీ నోటీసులు.. ఆసుపత్రిలో చేరానంటూ లేఖ