స్కూల్ ప్రేయర్ సమయంలో : గుండెపోటుతో 1వ తరగతి విద్యార్థిని మృతి

ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థిని గుండెపోటుతో చనిపోయింది. స్కూల్ ప్రేయర్ లో పాల్గొన్న సమయంలో గుండెపోటుతో విద్యార్థిని చనిపోయిన ఘటన జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ లో జరిగింది. జంషెడ్ పూర్ లో ని శిక్షానేతన్ స్కూల్ లో వైష్ణవి అనే చిన్నారి ఒకటో తరగతి చదువుతుంది.
మంగళవారం (అక్టోబర్ 15, 2019) ఉదయం క్లాస్ రూమ్ లో ప్రేయర్ లో పాల్గొన్న చిన్నారి ఒక్కసారిగా కింద పడిపోయింది. స్కూల్ ప్రిన్సిపల్ సుస్మితా దేయ్, వైస్ ప్రిన్సిపల్ రజనీ పాండే వెంటనే కిందపడిపోయిన చిన్నారిని టాటా మోటర్స్ హాస్పిటల్ కు తరలించారు.
ట్రీట్మెంట్ సమయంలో చిన్నారి చనిపోయింది. గుండెపోటు కారణంగానే తమ కూతురు చనిపోయిందని వైష్ణవి తల్లిదండ్రులు తెలిపారు. స్కూల్ కి షోకాజు నోటీసు జారీచేయాలని జిల్లా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించింది.