Cyber Crimes : హైదరాబాద్‌లో పెరుగుతున్న సైబర్ నేరాలు

పోలీసులు సైబర్ నేరగాళ్లపట్ల జాగ్రత్తగా ఉండమని ఎన్నిసార్లు చెపుతున్నా హైదరాబాద్ నగర ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు.

Cyber Crimes : హైదరాబాద్‌లో పెరుగుతున్న సైబర్ నేరాలు

Cyber Crime Hyderabad

Updated On : November 6, 2021 / 8:18 PM IST

Cyber Crimes :  పోలీసులు సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండమని  ఎన్నిసార్లు చెపుతున్నా హైదరాబాద్ నగర ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. హైదరాబాద్ అబిడ్స్ లోని ఇన్క్రా‌సాఫ్ట్ కంపెనీ సాఫ్ట్వేర్‌ను కేటుగాళ్ళు హ్యాక్ చేసారు. 10వేల డాలర్లు ఇవ్వాలని హ్యాకర్లు డిమాండ్ చేయటంతో కంపెనీ ప్రతినిధి షేక్ అజ్మద్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు.

మరోక కేసులో కౌన్ బనేగా కరోడ్ పతి లో( KBC ) లో రూ.25 లక్షల లాటరీ వచ్చిందని ఖైరతాబాద్‌కి చెందిన నాగమణి‌కి మెసేజ్ వచ్చింది. లాటరీ డబ్బులు ఇవ్వాలంటే జిఎస్టీ కట్టాలని..చెప్పి ఆమెవద్దనుంచి రూ.18 లక్షల రూపాయలు కేటుగాళ్ళు కాజేశారు. లాటరీ డబ్బులు రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశారు.

హైదరాబాద్ సంతోష్ నగర్‌కి చెందిన మహమ్మద్ సర్దార్‌కి వీసా ఇప్పిస్తామని ఆగంతకుల నుండి వాట్సప్ కాల్ వచ్చింది. నిజమని నమ్మిన సర్థార్ వారికి డబ్బులు ఇచ్చాడు. వివిధ చార్జీల పేరుతో రూ.4.5 లక్షలు కాజేశారు చీటర్స్.

Also Read : Actor Sonu Sood : కూరలు అమ్మిన సోనూసూద్

మరోక కేసులో ఇన్వెస్ట్మెంట్ పేరుతో హైదరాబాద్ సీతాఫల్ మండి కి చెందిన ఆరాధన రూ.5 లక్షల మోసం చేశారు. ఆమె కూడా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ పిర్యాదుల పై కేసులు నమోదు చేసుకొని సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నగర ప్రజలు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తతో ఉండాలని అత్యాశకు పోవద్దని. ఫోన్లకు వచ్చే మెసేజ్ లింక్ లు ఓపెన్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.