గన్ తో తల్లిని, అన్నను కాల్చేసింది

  • Published By: madhu ,Published On : August 30, 2020 / 07:59 AM IST
గన్ తో తల్లిని, అన్నను కాల్చేసింది

Updated On : August 30, 2020 / 8:20 AM IST

క్షణికావేశంలో దారుణాలకు తెగబడుతున్నారు. సొంతవాళ్లనే మట్టుబెడుతున్నారు. సీనియర్ రైల్వే మంత్రిత్వ శాఖలో పని చేస్తున్న అధికారి మైనర్ కూతురు గన్ తో తల్లిని, అన్నయ్యను కాల్చేయడం కలకలం రేపింది. లక్నోలోని గౌతంపల్లి పీఎస్ పరిధిలో శనివారం మధ్యాహ్నం వారింట్లో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

ఇద్దరిని చంపిన ఈమె..మానసిక పరిస్థితి బాగా లేదని, చంపేసిన అనంతరం మణికట్టు కోసుకుందని పోలీసు కమిషనర్ సుజీత్ పాండే వెల్లడించారు. సంఘటన సమయంలో తండ్రి ఢిల్లీలో ఉన్నాడని, బాలికను ఆసుపత్రిలో చేరిపించినట్లు తెలిపారు. షూటర్ గా శిక్షణ పొందిందని, 22 బోర్ రైఫిల్ ను ఉపయోగించి వారిద్దరినీ చంపేసిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హితేష్ చంద్ర వెల్లడించారు.

సంఘటనాస్థలాన్ని ఆయన సందర్శించారు. మూడు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని, ఒకటి అద్దానికి తగలగా, మరో రెండు బుల్లెట్లు తల్లి, సోదరుడి శరీరంలోకి దూసుకెళ్లాయన్నారు. వాష్ రూం అద్దంపై disqualified mirror బాలిక రాసిందన్నారు. నేరం ఒప్పుకుందని, రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీసు కమిషనర్ సుజీత్ పాండే తెలిపారు.