శ్రీలంకలో బాంబు పేలుళ్లు : 185కి చేరిన మృతుల సంఖ్య

  • Published By: veegamteam ,Published On : April 21, 2019 / 08:24 AM IST
శ్రీలంకలో బాంబు పేలుళ్లు : 185కి చేరిన మృతుల సంఖ్య

Updated On : April 21, 2019 / 8:24 AM IST

శ్రీలంకలోని కొలంబోలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 185కు చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో 35 మంది విదేశీయులు ఉన్నారు. మరో 350 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బట్టికలోవా ఆస్పత్రిలో 300 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. మూడు చర్చీలు, మూడు హోటళ్లలో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఉదయం 8.45 గంటల సమయంలో పేలుళ్లు సంభవించాయి. ఈస్టర్ డే వేడుకలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. దాడుల వెనుక ఇస్లామిక్ ఉగ్రవాదుల హస్తం ఉందని తెలుస్తోంది.

కొలంబోని సెయింట్ ఆంథోని చర్చిలో మొదటి పేలుడు, నెగోమోబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిలో రెండో పేలుడు, బట్టికలోవా ప్రాంతంలోని చర్చిలో మూడో పేలుడు, హోటల్ షాంగ్రిలా, సినామోన్ గ్రాండ్ హోటల్ లో పేలుళ్లు సంభవించాయి. షాంగ్రిల్లా హోటల్ దగ్గర ఆత్మాహుతికి పాల్పడింది జాహ్రాన్ హాసీమ్, బట్టికలోవా చర్చిలో ఆత్మాహుతి దాడికి పాల్పడింది అబూ మహ్మద్ గా గుర్తించారు. 

దాడులు జరుగొచ్చని శ్రీలంక ఇంటెలిజెన్స్ అధికారులు 4 రోజుల ముందే హెచ్చరించింది. 11 చర్చిల్లో పేలుళ్ల జరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. రెండు చోట్ల ఆత్మాహుతి దాడులు జరిగినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. హైఅలర్ట్ ప్రకటించింది. 2 రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. కొలంబోలో ఇంటర్ నెట్ సేవలు నిలిపివేశారు. వరుస బాంబు పేలుళ్లను శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఖండించారు. ప్రజలు సంయమనం పాటించి అధికారులకు సహకరించాలని పిలుపిచ్చారు. మరోవైపు ప్రధాని రనిల్ విక్రమ సింఘే అత్యవసర సమావేశం నిర్వహించారు. పేలుళ్ల ఘటనపై చర్చించారు.