Delhi Fire : ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 58 షాపులు దగ్ధం!

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ఎదురుగా లజ్‌పత్ రాయ్ మార్కెట్‌లో గురువారం (జనవరి 6) తెల్లవారుజామున 4.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 58 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి.

Delhi Fire : ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 58 షాపులు దగ్ధం!

Delhi Fire 58 Shops Caught Fire In Lajpat Rai Market In Front Of Red Fort, 8 Fire Tenders Reached The Spot

Updated On : January 6, 2022 / 10:17 AM IST

Delhi Fire : దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ఎదురుగా లజ్‌పత్ రాయ్ మార్కెట్‌లో గురువారం (జనవరి 6) తెల్లవారుజామున 4.45 గంటలకు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 58 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే 8 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మరో 4 అగ్నిమాపక యంత్రాలు చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అగ్నిప్రమాద ఘటనలో ప్రాణనష్టం జరిగినట్టు ఎలాంటి సమాచారం లేదు.

ఈ ప్రమాదంలో 58 షాపులు దగ్ధం కావడంతో భారీగా ఆస్తి నష్టమే వాటిల్లి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నెల రోజుల క్రితం ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో గుడిసెలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక దళానికి చెందిన 23 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని 3 నుంచి 4 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ నెబ్ సరాయ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.


బురారీలోని ఇంట్లో ప్రమాదం.. 12 ఏళ్ల చిన్నారి మృతి
ఢిల్లీలోని జీబీ రోడ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అగ్నిమాపక శాఖకు చెందిన 6 వాహనాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చాయి. అంతకుముందు నవంబర్ 6న బురారీ ప్రాంతంలో ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12 ఏళ్ల చిన్నారి సజీవదహనమైంది. తోమర్ కాలనీలో ఉన్న ఇంటి మొదటి అంతస్తులోని వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి.

Read Also : India Corona : భారత్ లో మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 90,928 పాజిటివ్ కేసులు, 325 మరణాలు