Moinabad Case : మొయినాబాద్ డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ కేసు..యువతుల ఇళ్లలో విషాద ఛాయలు..టెస్ట్‌లో 228 రీడింగ్

మాములుగా 30 ప్లస్ రీడింగ్ ఉంటేనే పోలీసులు కేసు నమోదు చేస్తారు.. అలాంటిది 228 రీడింగ్ చూపించిందంటే ఆ మందుబాబు ఏ రేంజ్‌లో తాగి డ్రైవ్‌ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు...

Moinabad Case : మొయినాబాద్ డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ కేసు..యువతుల ఇళ్లలో విషాద ఛాయలు..టెస్ట్‌లో 228 రీడింగ్

Drunk

Updated On : December 27, 2021 / 2:33 PM IST

Drunk Drive Moinabad Case : వరుస ప్రమాదాలు.. క్షణాల్లో పోతున్న ప్రాణాలు.. అయినా మందుబాబుల తీరు మారడం లేదు.. ఫుల్లుగా తాగడం.. రోడ్లపై పడి ప్రజల పాలిట యమకింకరులుగా మారడం రోటీన్‌గా మారిపోయింది. ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెడుతున్నా..డోంట్ కేర్ అంటున్నారు మందుబాబులు. రోడ్లపైకి రయ్యి రయ్యి మంటూ వాహనాలను పోనిస్తూ..నిండు ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఇలాంటి ఎన్ని ఘటనలు జరుగుతున్నా..వారిలో మార్పు రావడం లేదు. తాజాగా..మొయినాబాద్‌లో ఓ తాగుబోతు కుటుంబంలో తీరన వేదన నింపాడు.. ఫూటుగా తాగి ఇద్దరు యువతుల మృతికి కారణమయ్యాడు. మందుబాబు చేసిన దారుణానికి మరో యువతి ఆసుపత్రిలో కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.

Read More : AP Cyber Crime : లవ్ లైఫ్..ప్రేమే జీవితమంటూ..కోట్ల రూపాయల మోసం

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని తాజ్‌ డ్రైవ్‌ ఇన్‌ వద్ద రెండు రోజుల క్రితం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఎదురుగా వస్తున్న ఓ బైక్‌ను ఢీకొట్టాడు ఓ మందుబాబు.. ఆ సమయంలో బైక్‌పై ముగ్గురు అక్కాచెల్లెల్లు వెళతున్నారు.. ప్రమాద తీవ్రతకు బండి ముక్కలు ముక్కలైంది.. స్పాట్‌లోని ప్రేమిక అనే యువతి మృతి చెందగా.. మరో ఇద్దరు బాధితులను ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటన శనివారం రాత్రి జరగగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సౌమ్య నిన్న రాత్రి ప్రాణాలు విడిచింది.. మరో యువతి అక్షయ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Read More : Weather Forecast : తెలంగాణా‌లో రేపు, ఎల్లుండి తేలిక పాటి వర్షాలు..ఏపీలో పొడి వాతావరణం

మృతి చెందిన ప్రేమికా, సౌమ్య సొంత అక్కాచెల్లెల్లు కాగా.. అక్షయ వారి పెద్దనాన్న కూతురు. సరదాగా బయటికి వచ్చిన వారు మరికాసేపట్లో తిరిగి వస్తారనుకుంటే ఇలా విగతజీవులుగా మారడంతో ఇప్పుడా యువతుల ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. ఇక ఈ దారుణానికి పాల్పడిన ప్రబుద్ధుడికి డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ టెస్ట్‌ చేయగా ఏకంగా 228 రీడింగ్ చూపించింది.. మాములుగా 30 ప్లస్ రీడింగ్ ఉంటేనే పోలీసులు కేసు నమోదు చేస్తారు.. అలాంటిది 228 రీడింగ్ చూపించిందంటే ఆ మందుబాబు ఏ రేంజ్‌లో తాగి డ్రైవ్‌ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.